Luggage bags: లగేజీ బ్యాగుకు అతికించే ట్యాగ్‌ల వెనుక ఇన్ని సీక్రెట్స్ ఉన్నాయా?

Luggage bags: విమాన ప్రయాణంలో సర్వసాధారణంగా చెక్-ఇన్ ట్యాగ్ కనిపిస్తుంది. చెక్-ఇన్ కౌంటర్‌లో మీ బ్యాగ్‌ను అప్పగించిన వెంటనే ఈ ట్యాగ్‌ను అతికిస్తారు.

Luggage bags

విమానాశ్రయంలో మీరు చెక్-ఇన్ చేసే ప్రతి లగేజీ బ్యాగుకు ఒక చిన్న ట్యాగ్‌ను అతికించడం మనం చూస్తూనే ఉంటాం. మీ బ్యాగ్ (Luggage bagsఎక్కడికి వెళ్లాలి, ఏ విమానంలో లోడ్ కావాలి, ఎంత జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్లాలి, చివరకు అది మీకు ఎప్పుడు అందాలి అనే విషయాలన్నీ ఈ చిన్న లగేజీ ట్యాగ్ (Baggage Tag) నిర్ధారిస్తుంది. ఇది కేవలం ట్రాకింగ్ కోడ్ మాత్రమే కాదు, ప్రతి రంగు, ప్రతి అక్షరం సిబ్బందికి ఒక ముఖ్యమైన ఆదేశాన్ని ఇస్తుంది.

సాధారణ ట్యాగ్ (Check-in Tag) బ్యాగు(Luggage bags)కు ఆధార్ కార్డుతో సమానం. విమాన ప్రయాణంలో సర్వసాధారణంగా కనిపించేది ఈ చెక్-ఇన్ ట్యాగ్.

మీరు చెక్-ఇన్ కౌంటర్‌లో మీ బ్యాగ్‌(Luggage bags)ను అప్పగించిన వెంటనే ఈ ట్యాగ్‌ను అతికిస్తారు. ఇందులో ప్రధానంగా విమానయాన సంస్థ కోడ్ (ఉదాహరణకు, UR), బయలుదేరే మరియు చేరే విమానాశ్రయాల కోడ్ (ఉదా: HYD, DEL), విమాన నంబర్, తేదీ మరియు ఒక ప్రత్యేకమైన బార్‌కోడ్ ఉంటాయి.

ఈ బార్‌కోడ్‌ను విమానాశ్రయ కన్వేయర్ బెల్ట్‌లోని వ్యవస్థలు స్కాన్ చేస్తాయి. ఆ వెంటనే, బ్యాగ్‌ను సరైన విమానం వైపు, సరైన గమ్యస్థానానికి మళ్లించే పని ఆటోమేటిక్‌గా మొదలవుతుంది. ఈ ట్యాగ్ మీ బ్యాగ్ యొక్క మొత్తం ప్రయాణాన్ని రికార్డు చేస్తుంది.

సాధారణ ట్యాగ్‌లతో పాటు, కొన్ని ప్రత్యేక పరిస్థితులు మరియు ప్రయాణీకుల వర్గాల కోసం విమానయాన సంస్థలు ప్రత్యేక రంగులు, అక్షరాలతో కూడిన ట్యాగ్‌లను ఉపయోగిస్తాయి. వీటిలో చాలా రకాల అర్థాలు ఇమిడి ఉన్నాయి.

Luggage bags

రష్ ట్యాగ్ (Rush Tag) వేగవంతమైన ప్రయాణం.. మీ బ్యాగ్ గత విమానంలో లోడ్ కాకుండా పొరపాటున ఎక్కడైనా ఉండిపోయినా లేదా ఆలస్యంగా వచ్చినా, అది ఎక్స్‌ప్రెస్ వేగంతో తదుపరి విమానానికి పంపడానికి దీన్ని వాడతారు. ఆలస్యం అయిన లగేజీని వెంటనే గుర్తించి, ప్రాధాన్యతతో చేర్చమని ఈ ట్యాగ్ సిబ్బందికి సూచిస్తుంది.

హెవీ ట్యాగ్ (Heavy Tag) భారీ బరువు హెచ్చరిక.. మీ లగేజీ బరువు 23 కిలోల నుంచి 32 కిలోల మధ్య ఉన్నప్పుడు ఈ ట్యాగ్‌ను అతికించవచ్చు. 32 కిలోల కంటే ఎక్కువ బరువున్న బ్యాగులను విమానంలో లోడ్ చేయరు. ఈ ట్యాగ్, లోడ్ చేసే సిబ్బందికి బ్యాగ్ బరువుగా ఉందని, దాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని తెలియజేస్తుంది.
ఫ్రాజైల్ ట్యాగ్ (Fragile Tag) పెళుసు వస్తువుల జాగ్రత్త.. మీ బ్యాగులో గాజు వస్తువులు, లేదా తేలికగా విరిగిపోయే వస్తువులు ఉన్నప్పుడు ఈ ట్యాగ్‌ను ఉచితంగా వేయించుకోవచ్చు.

ఈ ట్యాగ్ ఉన్న బ్యాగుల(Luggage bags)ను మిగతా లగేజీపై వేయకుండా, ప్రత్యేకంగా, చాలా జాగ్రత్తగా (Soft Handling) లోడ్ చేయాలని సిబ్బందికి ఆదేశిస్తుంది. ప్రాధాన్యత ట్యాగ్ (Priority Tag) మొదటిగా బయటకు.. ఇది బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్, తరచుగా ప్రయాణించే ప్రీమియం కస్టమర్లు లేదా వీఐపీ ప్రయాణీకులకు వేస్తారు. గమ్యస్థానం చేరిన తర్వాత, లగేజీ బెల్ట్‌పై ఈ బ్యాగులను ముందుగా పంపాలని ఈ ట్యాగ్ సూచిస్తుంది.

యునకంపీనీడ్ ట్యాగ్ (Unaccompanied Minor Tag) పిల్లల పర్యవేక్షణ.. తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా ప్రయాణించే పిల్లల బ్యాగులపై దీనిని వేస్తారు. ఈ ట్యాగ్ బ్యాగ్‌కు అదనపు పర్యవేక్షణ (Special Supervision) అవసరమని సిబ్బందిని హెచ్చరిస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలు మరియు వారి వస్తువులు VIPల కంటే కూడా ముఖ్యమైనవిగా విమానయాన సంస్థలు భావిస్తాయి.

గన్ ట్యాగ్ (Gun Tag) ప్రత్యేక భద్రతా తనిఖీ.. ప్రయాణీకుడికి లైసెన్స్ ఉన్న ఆయుధం (లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్) లగేజీలో ఉంటే, భద్రతా నిబంధనల ప్రకారం దాన్ని ప్రత్యేకంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ ట్యాగ్‌ను అతికిస్తారు.

వీల్‌చైర్ ట్యాగ్ (Wheelchair Tag) సహాయం అవసరం.. వీల్‌చైర్ సహాయం అవసరమయ్యే ప్రయాణీకుల బ్యాగులకు దీన్ని వేస్తారు. ప్రయాణీకుడు వచ్చిన తర్వాత వీల్‌చైర్ సహాయాన్ని అందించాలని ఈ ట్యాగ్ సంబంధిత సిబ్బందికి సూచిస్తుంది.

క్యాబిన్ బ్యాగ్ ట్యాగ్ ఎందుకు ముఖ్యమంటే లగేజీ ట్యాగ్‌తో పాటు, మీరు మీతో క్యాబిన్‌లోకి తీసుకెళ్లే చిన్న బ్యాగులకు కూడా కొన్ని ఎయిర్‌లైన్స్ ట్యాగ్‌ను ఇస్తాయి.
ఈ చిన్న ట్యాగ్ మీ బ్యాగ్‌ను క్యాబిన్ లగేజీ పరిమితుల (సైజు మరియు బరువు)కు అనుమతించారని సిబ్బందికి తెలియజేస్తుంది.

చాలా మంది ప్రయాణీకులు తమ క్యాబిన్ బ్యాగ్‌(Luggage bags)ను చెక్-ఇన్ కౌంటర్‌లో చూపకుండా నేరుగా బోర్డింగ్ గేట్‌కు తీసుకువెళతారు. అక్కడ సిబ్బంది తనిఖీ చేసినప్పుడు, ట్యాగ్ లేకపోతే, దాని బరువును లేదా సైజును తనిఖీ చేసి, నిబంధనలు మించితే అదనపు డబ్బు చెల్లించవలసి రావచ్చు.

అందుకే, ఆ చిన్న బ్యాగ్ ట్యాగ్‌ను అస్సలు చిన్నదిగా చూడకూడదు. దాని వెనుక విమానాశ్రయం యొక్క క్లిష్టమైన లాజిస్టిక్స్ , భద్రతా ప్రక్రియలు దాగి ఉన్నాయి.

Office calls: ఆఫీస్ అయ్యాక..ఆఫీస్ కాల్స్, మెయిల్స్‌ పట్టించుకోనక్కరలేదు..పార్లమెంటులో ఈ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారు?

Exit mobile version