Hill Stations
ఇంకొద్ది రోజుల్లో వేసవి కాలం రాబోతోంది. సమ్మర్ రాగానే అందరూ హిల్ స్టేషన్ల(Hill Stations) వైపు పరుగులు తీస్తారు. అందుకే ఆ సమయంలో అరకు వేలీ, ఊటీ, కొడైకెనాల్, సిమ్లా వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిక్కిరిసి ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తే ..అక్కడ ట్రాఫిక్ జామ్‌లు, డబుల్ ఛార్జీలతో ట్రిప్ ఎంజాయ్ చేసిన మూడ్ కాస్తా పోతుంది. అందుకే ఈసారి రొటీన్‌కు భిన్నంగా, రద్దీ తక్కువగా ఉండి.. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపగలిగే 5 అద్భుతమైన ఆఫ్ బీట్ హిల్ స్టేషన్ల(Hill Stations) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చోప్తా (ఉత్తరాఖండ్)- మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా..హిమాలయాల ఒడిలో ఉన్న చోప్తా ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఇది. సముద్ర మట్టానికి దాదాపు 2680 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం పచ్చని మఖ్మల్ మైదానాలకు (Bugyals)ఇక్కడ ప్రసిద్ధి. ఎటు చూసినా మంచు శిఖరాలు, దట్టమైన అడవులు కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులకు నిజంగా స్వర్గమే . ట్రెకింగ్ ఇష్టపడే వారికి అయితే ఇది బెస్ట్ ప్లేస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న శివాలయం తుంగనాథ్ ఇక్కడికి చాలా దగ్గర్లోనే ఉంటుంది. రద్దీకి దూరంగా హిమాలయాల ప్రశాంతతను ఆస్వాదించాలనుకునే వారికి చోప్తా సరైన ఎంపిక అన్న విషయం గుర్తు పెట్టుకోండి.
చికమగళూరు (కర్ణాటక) – కాఫీ పరిమళాల లోయ..దక్షిణ భారత దేశంలో కూర్గ్ గురించి చాలామందికి తెలుసు, కానీ దానికంటే ప్రశాంతంగా ఉండే బ్యూటీ ఫుల్ ప్లేస్ చికమగళూరు. పశ్చిమ కనుమల మధ్య ఉండే ఈ ప్రాంతం కాఫీ తోటలకు పెట్టింది పేరు. ఇక్కడ ముల్లయనగిరి వంటి ఎత్తైన శిఖరాలు, మణిఖ్యధార వంటి జలపాతాలు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తాయి. హోమ్ స్టేలలో ఉంటూ కాఫీ తోటల మధ్య నడవడం ఒక మధురమైన అనుభూతిని ఇస్తుంది. బెంగళూరుకు దగ్గరగా ఉండటం వల్ల ప్రయాణం కూడా చాలా ఈజీగా ఉంటుంది.
మావ్లిన్నాంగ్ (మేఘాలయ) – దేవుని స్వంత తోట..ఈశాన్య భారత దేశంలో మేఘాలయ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు అక్కడికి వెళ్లినవారు. మావ్లిన్నాంగ్ గ్రామం ఆసియాలోనే అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ‘లివింగ్ రూట్ బ్రిడ్జెస్’ (చెట్ల వేర్లతో తయారైన వంతెనలు) ప్రధాన ఆకర్షణ. ఇక్కడి ప్రజల ఆతిథ్యం, పచ్చదనం పర్యాటకులను మరో లోకంలోకి తీసుకెళ్తాయి. వర్షాకాలం ప్రారంభంలో ఇక్కడి జలపాతాలు కళకళలాడుతూ కనిపిస్తాయి.
తీర్థన్ వ్యాలీ (హిమాచల్ ప్రదేశ్) – ప్రశాంతతకు మారుపేరు..హిమాచల్ ప్రదేశ్‌లో కులు-మనాలి రద్దీకి దూరంగా ఉండాలనుకునే వారు ఈ తీర్థన్ వ్యాలీని ఎంచుకోవచ్చు. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ప్రక్కనే ఉండే ఈ లోయ గుండా తీర్థన్ నది ప్రవహిస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద హోటళ్ల కంటే నది ఒడ్డున ఉండే ట్రీ హౌస్ లు, చిన్న కాటేజీలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గాలం వేసి చేపలు పట్టడం (Trout Fishing), అడవిలో క్యాంపింగ్ చేయడం ఇక్కడ గొప్ప అనుభూతి.
కాలింపాంగ్ (పశ్చిమ బెంగాల్) – ఆర్కిడ్ల నగరం..డార్జిలింగ్ రద్దీని తట్టుకోలేమనుకునే వారికి కాలింపాంగ్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఇక్కడి నుంచి కాంచనజంగా పర్వత శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందమైన బౌద్ధ మఠాలు (Monasteries), అరుదైన ఆర్కిడ్ పూల నర్సరీలు ఇక్కడ పర్యాటకులను ఆకర్షిస్తాయి. తీస్తా నదిలో రివర్ రాఫ్టింగ్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ధరలు కూడా డార్జిలింగ్ తో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటాయి.
ఈ వేసవిలో ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల మీ ప్రయాణం కేవలం విహారయాత్రలా కాకుండా, మీ మనసుకి ఒక రీఛార్జ్‌లా మారుతుందనడంలో నో డౌట్. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఈ ‘హిడెన్ జెమ్స్’ ను మీ బకెట్ లిస్ట్ లో ఇప్పుడే చేర్చుకోండి.
Phone Tapping : సంతోష్ రావుకు సిట్ నోటీసులు..ఇక మిగిలింది కవిత, కేసీఆరేనా ?
