Oil Pulling:ఆయిల్ పుల్లింగ్ నోటి ఆరోగ్యానికే కాదు..ఇంకా చాలా ఉపయోగాలున్నాయట

Oil Pulling: 15 నుంచి 20 నిమిషాల పాటు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెను కానీ నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి

Oil Pulling

ఆధునిక కాలంలో మనం రకరకాల మౌత్ వాష్‌లను వాడుతున్నాం. కొంతమంది ఆయిల్ పుల్లింగ్(Oil Pulling) కూడా చేస్తుంటారు. అయితే కొన్ని వేల ఏళ్ల క్రితమే మన ఆయుర్వేదంలో గండూషం లేదా ఆయిల్ పుల్లింగ్ గురించి వివరించారట.

కేవలం 15 నుంచి 20 నిమిషాల పాటు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెను కానీ నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల మనిషి శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి.

మన నోటిలో వందలాది రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటి వల్ల దంతాల నొప్పి, చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన వస్తాయి. నూనెను పుక్కిలించినప్పుడు అది మ్యాగ్నెట్ లాగా పని చేసి, నోటిలోని టాక్సిన్స్‌ (Toxins) తనలోకి లాగేసుకుంటుంది. దీనివల్ల దంతాలు తెల్లగా మారడమే కాదు చిగుళ్లు దృఢంగా తయారవుతాయి. దీనివల్ల కేవిటీస్ సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది.

Oil Pulling

ఆయిల్ పుల్లింగ్(Oil Pulling) కేవలం నోటి ఆరోగ్యానికే పరిమితం కాదట. నోటిలోని రక్తనాళాల ద్వారా ఇది శరీరంలోని ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు. క్రమం తప్పకుండా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. హార్మోన్ల అసమతుల్యత దెబ్బతిన్న వారికి ఇది మేలు చేస్తుంది. స్కిన్ గ్లో అవడానికి , మొటిమలు తగ్గడానికి ఇది ఒక నేచురల్ థెరపీలా పనిచేస్తుంది.

ఉదయాన్నే పళ్లు తోముకోకముందే ఒక టేబుల్ స్పూన్ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెను నోట్లో పోసుకోవాలి. సుమారు 15 నిమిషాల పాటు నలుమూలలా పుక్కిలించాలి. ఆ తర్వాత నూనె చిక్కగా, తెల్లగా మారుతుంది. దానిని మింగకుండా బయట ఊసేయాలి . ఆ తర్వాత గోరువెచ్చని నీటితో నోరు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది.

Phone Tapping : సంతోష్ రావుకు సిట్ నోటీసులు..ఇక మిగిలింది కవిత, కేసీఆరేనా ?

 

Exit mobile version