Trip: సోలో ట్రిప్ ప్లాన్ చేశారా? అయితే ఇవి తెలుసుకోండి

Trip: ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన వివరాలు వంటివన్నీ ముందే పేరెంట్స్‌కు లేదా అత్యంత సన్నిహితులకు చెప్పడం తప్పనిసరి.

Trip

సాధారణ రొటీన్ లైఫ్ నుంచి విముక్తి పొంది, తమతో తాము కొంత సమయం గడిపేందుకు ఈ రోజుల్లో సోలో ట్రిప్స్ (Solo Trips) అంటే చాలా మంది క్రేజీగా ఫీలవుతున్నారు. అయితే, ఒంటరిగా టూర్లకు వెళ్లేముందు పర్యాటక నిపుణులు (Tourism Experts) చెబుతున్న కొన్ని ముఖ్య విషయాలను తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. భద్రత, సౌకర్యం విషయంలో ఈ జాగ్రత్తలు చాలా కీలకం.

తల్లిదండ్రులకు ముందే చెప్పాలి.. సోలో ట్రిప్(Trip) అంటూ ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్తే, ఆ టూర్‌ను మీరు పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. తెలియని ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉండగా, ఇంట్లో వాళ్లు మీకోసం కంగారు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన వివరాలు వంటివన్నీ ముందే పేరెంట్స్‌కు లేదా అత్యంత సన్నిహితులకు చెప్పడం తప్పనిసరి.

Trip

షార్ట్ ట్రిప్‌(Trip)తో ప్రారంభించడం మంచిది.. తొలిసారిగా సోలో ట్రిప్ వెళ్లేవారు, సౌకర్యంగా మరియు భద్రతగా ఉండేలా తక్కువ రోజుల షార్ట్ ట్రిప్‌ను (2-3 రోజులు) ప్లాన్ చేసుకోవాలట. సోలో ట్రావెలింగ్‌లో అనుభవం పెరిగిన తర్వాత, ఒకటి లేదా రెండు టూర్ల తర్వాత మాత్రమే లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడం సురక్షితమైన నిర్ణయం.

తెలియని ప్రాంతాన్ని ఎంచుకోవాలి.. సోలో ట్రిప్‌కు ఇప్పటికే చూసిన ప్రాంతం కాకుండా, ఇప్పటివరకు చూడని కొత్త ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం మరింత ఆసక్తినిస్తుంది. ముఖ్యంగా వాటర్ ఫాల్స్, హిల్ స్టేషన్లకు వెళ్లే క్రమంలో అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, సాహస క్రీడల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, ఇప్పటివరకు చూడని పుణ్య క్షేత్రాలను దర్శించాలనుకుంటే కొత్త వాటిని ఎంచుకోవాలి.

పకడ్బందీ ప్రణాళిక తప్పనిసరి.. టూర్లకు వెళ్లే ముందు ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న పర్యాటక ప్రదేశాలు, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు, లాడ్జింగ్ సౌకర్యాలు , వాటి టైమింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ట్రిప్‌కు వెళ్లే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులపై ముందే అవగాహన కలిగి ఉండటం ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా చేస్తుంది. అత్యవసర పరిస్థితుల కోసం కొంత అదనపు డబ్బు లేదా క్రెడిట్ కార్డు వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version