Silent People
సమాజంలో ఎక్కువగా మాట్లాడే వాళ్లను బలంగా, ధైర్యవంతులుగా చూడటం ఒక అలవాటు. అదే నిశ్శబ్దంగా (Silent People)ఉండే వాళ్లను చూస్తే వీళ్లకు కాన్ఫిడెన్స్ లేదు లేదా వీళ్లు వీక్ అనే ముద్ర వేయడం చాలా సులభం.
కానీ సైకాలజీ చెప్పే సత్యం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. సైలెంట్‌గా ఉండడం అంటే బలహీనత కాదు, చాలాసార్లు అది లోతైన ఆలోచనలకు , అత్యున్నతమైన ఏకాగ్రతకు సంకేతం. సైలెంట్ వ్యక్తులు మాట్లాడే ముందు చాలా ఆలోచిస్తారు. ప్రతి విషయం మీద అనవసరంగా స్పందించాల్సిన అవసరం లేదని వాళ్లకు స్పష్టంగా తెలుసు.
Silent Peopleచిన్నప్పటి నుంచే క్లాస్‌లో ఎక్కువగా వాదించే పిల్లలే తెలివైన వాళ్లని మనం పొరబడతాం. కానీ నిశ్శబ్దంగా ఉండే పిల్లలు ఎక్కువగా వింటారు, పరిసరాలను గమనిస్తారు మరియు విషయాలను లోతుగా అర్థం చేసుకుంటారు.
సైకాలజీ ప్రకారం, సైలెంట్ వ్యక్తుల్లో సెల్ఫ్-అవేర్‌నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్లు తమ భావాలను లోపలే ప్రాసెస్ చేసుకుంటారు. ప్రతి ఫీలింగ్‌ని బయట పెట్టాల్సిన అవసరం లేదని నమ్ముతారు. గొడవలు, అనవసరమైన వాదనలు వీళ్లకు మానసిక అలసటను కలిగిస్తాయి, అందుకే వీళ్లు శాంతిని ఎంచుకుంటారు తప్ప భయంతో మౌనంగా ఉండరు.
చాలామంది సైలెంట్ వ్యక్తుల(Silent People)ను ఇంట్రోవర్ట్స్‌గా చూస్తారు. వాళ్లకు ఏకాంతంలోనే శక్తి లభిస్తుంది. వీళ్లలో ఉండే ఒక బలమైన గుణం ఏమిటంటే, వీళ్లు ఎప్పుడు మాట్లాడినా ఆ మాటలో చాలా బరువు ఉంటుంది. అవసరం లేని మాటలు చెప్పరు కాబట్టి, వాళ్లు చెప్పే ఒక్క మాట కూడా సమాజంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.
చరిత్రను గమనిస్తే, ప్రపంచాన్ని మార్చిన గొప్ప గొప్ప నాయకులు మరియు ఆలోచనాపరులు నిశ్శబ్దంగా తమ పనిని చేసుకుపోయిన వారే. వీళ్లు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్లు కాబట్టి, ఎదుటివారి మూడ్‌ను త్వరగా కనిపెట్టగలరు. గాలి మనకు కంటికి కనిపించదు కానీ, తుఫాను శక్తి దానికే ఉంటుంది. సైలెంట్ వ్యక్తుల శక్తి కూడా సరిగ్గా అలాంటిదే. మౌనం అనేది ఒక బలహీనత కాదు, అది ఒక నిశ్శబ్ద విప్లవం.
