Bajji: బీరకాయతో కరకరలాడే బజ్జీలు ఓసారి ట్రై చేయండి.. ఎవరైనా సరే వన్ మోర్ అనాల్సిందే!

Bajji: సాధారణంగా మనం మిర్చీ బజ్జీలు, అరటికాయ, వంకాయ బజ్జీలనే ఎక్కువగా తింటుంటాం.

Bajji

బజ్జీ(Bajji) అంటేనే భారతీయులకు, ఇంకా చెప్పాలంటే మన తెలుగువారికి ఒక ఎమోషన్. వర్షం పడుతున్నా లేదా చలిగా ఉన్నా.. వేడివేడి బజ్జీలను అల్లం చట్నీతో తింటుంటే ఆ మజాయే వేరు అంటూ లొట్టలేసుకుని లాగించేస్తాము. సాధారణంగా మనం మిర్చీ బజ్జీలు, అరటికాయ, వంకాయ బజ్జీలనే ఎక్కువగా తింటుంటాం.

కానీ, ఎప్పుడూ కూడా బీరకాయతో బజ్జీ(Bajji)లను ప్రయత్నించి ఉండరు. కానీ వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా, రుచిలో మాత్రం ఇవి మిగిలిన అన్ని బజ్జీలను మించిపోతాయని మీరే ఒప్పుకుంటారు. ముఖ్యంగా బీరకాయ కూర అంటే ముఖం చాటేసే పిల్లలకు ఇలా వెరైటీగా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ బజ్జీల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి నూనెను చాలా తక్కువగా పీల్చుకోవడంతో పాటు పైన కరకరలాడుతూ లోపల మెత్తగా భలే రుచిగా ఉంటాయి.

ఈ(Bajji) స్నాక్ తయారు చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమూ లేదు. ముందు ఒక మూడు లేత బీరకాయలను తీసుకుని, వాటిని శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి. వీటిని మరీ సన్నగా కాకుండా, కొంచెం మందంగా నిలువు ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో మూడు కప్పుల శనగపిండిని తీసుకుని, అందులో పావు కప్పు బియ్యపు పిండిని కలపాలి.

Bajji

ఇలా బియ్యప్పిండి వాడటం వల్ల బజ్జీలు కరకరలాడుతూ వస్తాయి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి , పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మరీ జారుగా కాకుండా, బజ్జీల పిండిలా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా ఉంటే ముక్కలకు సరిగ్గా అంటుకోదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

తర్వాతి స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె బాగా వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్ లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొడవు బీరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచి, నూనెలో వేయాలి. బజ్జీలను రెండు వైపులా ఎర్రగా వేగే వరకు తిప్పుతూ వేయించాలి.

ఆ బజ్జీలు(Bajji) గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసి ఒక ప్లేట్ లోకి పెట్టుకోవాలి. వేడివేడి ఈ బీరకాయ బజ్జీలను పుదీనా చట్నీతో అయినా టమోటా కెచప్ తో అయినా తింటే అద్దిరిపోతుంది. అసలు ఏ చట్నీ లేకపోయినా వీటి రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో రెడీ అయ్యే ఈ స్నాక్, మీ ఇంటిలో అందరికీ కచ్చితంగా ఫేవరెట్ అవుతుంది. ఇక నుంచి మీరు మార్కెట్ కు వెళ్లినప్పుడల్లా బజ్జీల కోసమే బీరకాయలు కొనుక్కుని వచ్చేంత టేస్టీగా ఉంటాయి. లేటెందుకు మరి ట్రై చేయండి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version