Career:ఆఫీస్‌లో మీరు కూర్చునే విధానం మీ కెరీర్‌ని మారుస్తుంది.. ఈ వాస్తు టిప్స్ మీకోసమే

Career: ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని కొందరు, ప్రమోషన్లు రావడం లేదని మరికొందరు బాధపడుతుంటారు.

Career

మనం పనిచేసే ప్రదేశంలో ఉండే ఎనర్జీ మన పనితీరుపై, మన కెరీర్(Career) ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయం చాలామందికి తెలీదు. ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదని కొందరు, ప్రమోషన్లు రావడం లేదని మరికొందరు బాధపడుతుంటారు. ఇలాంటివారు తమ ఆఫీస్ టేబుల్ వాస్తును ఒకసారి సరిచూసుకోవాలంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం, మనం కూర్చునే దిశ, మన టేబుల్‌పై ఉంచుకునే వస్తువులు మనలో సానుకూల దృక్పథాన్ని పెంచి, విజయం వైపు నడిపిస్తాయట.

ముందుగా, ఆఫీసులో మీరు కూర్చునే దిశ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి. ఇది కుదరని పక్షంలో ఈశాన్యం వైపు ముఖం చేసి కూర్చోవడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది. అలాగే మీ వెనుక భాగంలో కిటికీ కానీ ఖాళీ ప్రదేశం కానీ ఉండకూడదు, ఒక గట్టి గోడ ఉండటం వల్ల మానసిక స్థిరత్వం లభిస్తుందట.

అంతేకాకుండా మీ టేబుల్‌పై స్పటిక బంతి(Crystal Ball) ఉంచుకోవడం వల్ల ఆఫీసులో ఉండే కామన్‌గా ఉండే పాలిటిక్స్ కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రభావం చూపించవట. అలాగే టేబుల్ ఈశాన్య మూలలో ఒక చిన్న వెదురు మొక్క (Bamboo Plant) లేదా గ్లాస్ గిన్నెలో నీరు పోసి అందులో ప్లవర్స్ ఉంచడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.

Career

మీ వర్క్‌కు సంబంధించిన ఫైళ్లను ఎప్పుడూ టేబుల్ ఎడమ వైపున ఉంచాలి. టేబుల్ మధ్యలో ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉండాలి. టేబుల్ నిండా అనవసరమైన కాగితాలు, పెన్నులు పారేయకుండా ఎప్పటికప్పుడు సర్దుకోవాలి.

పెన్ స్టాండ్‌ను టేబుల్ ఆగ్నేయ మూలలో ఉంచడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. మీరు కూర్చునే కుర్చీ సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా.. దాని వెనుక భాగం ఎత్తుగా ఉండటం వల్ల మీకు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. ఈ చిన్న చిన్న వాస్తు మార్పులు మీలో కాన్ఫిడెన్స్‌ను పెంచి, పై అధికారుల నుంచి ప్రశంసలు పొందేలా చేసి కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతారు.

Real Estate:స్తంభించిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..అయోమయంలో కొనుగోలుదారులు..! పరిష్కారమెప్పుడు?

Exit mobile version