Viral video:ఈ వీడియో చూశాకైనా మారతారా? స్ట్రీట్ ఫుడ్ వెండర్ షాకింగ్ చర్య

Viral video:స్ట్రీట్ ఫుడ్ తినేముందు ఒక్కసారి ఆలోచించండి..

Viral video

స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ ఉంటారు. ఆఫీసులో బ్రేక్ టైం దొరికిందంటే చాలు, రోడ్డు పక్కన బండి దగ్గర ఏదో ఒకటి తినేస్తుంటారు. కానీ ఆ తినుబండారాలను ఎలా తయారు చేస్తున్నారనేది మాత్రం చాలామంది పట్టించుకోరు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో (Viral video)చూస్తే మాత్రం..ఈ స్ట్రీట్ ఫుడ్ నాకొద్దు బాబోయ్ అని అనక తప్పదు.

ఈ షాకింగ్ ఘటన లుథియానా(Ldhiana)లో చోటుచేసుకుంది. ఒక వ్యాపారి బ్రెడ్ బజ్జీలు తయారు చేస్తూ, నూనె ప్యాకెట్లను కత్తిరించకుండా, ఏకంగా వాటిని వేడి నూనెలో ముంచి ఆయిల్ ప్యాకెట్ల(plastic oil packets)ను ఖాళీ చేశాడు. అక్కడ బజ్జీలు తినడానికి వచ్చిన ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో (Viral Video) తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌(Street food video viral)గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యాపారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral-video

ఈ బజ్జీలు మాకొద్దు రా సామి.. అంటూ నెటిజన్లు భయపడుతున్నారు. అతను వాడే నూనె ఇప్పటికే కల్తీ అయ్యి ఉంటుందంటే, మళ్లీ ప్లాస్టిక్ ప్యాకెట్లను వేడి నూనెలో ముంచి దానిని మరింత విషపూరితం చేస్తున్నాడని మండిపడుతున్నారు. ప్లాస్టిక్ కరిగి నూనెలో కలవడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నాణ్యత లేని ఆహారాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఏంటని ఆ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఆ వ్యాపారి మాత్రం తన చర్యను సమర్థించుకోవడం మరింత ఆశ్చర్యం కలిగించింది. వేడి నూనెలో ప్లాస్టిక్ ప్యాకెట్ తొందరగా కట్ అవుతుందని, సమయం ఆదా అవుతుందని అతడు చెబుతున్నాడు. “సమయం ఆదా చేయడానికే ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం సులభం అనా ఈ పని ఎంచుకున్నావు?” అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

రుచి కోసమో, సమయం లేకపోవడం వల్లో రోడ్డు పక్కన దొరికే ఆహారాన్ని ఎంచుకుంటున్న చాలామందికి ఇది ఒక కనువిప్పు కావాలి. డాక్టర్లు పదేపదే హెచ్చరించినా, “రుచి ముఖ్యం, ఆరోగ్యం ది ఏముందిలే” అనుకునే వాళ్లకు ఇలాంటి వీడియోలు (viral video)భయాన్ని కలిగించినా, చాలామంది తమ అలవాట్లను మార్చుకోవడం లేదు. ఇకనైనా మారండి. మీకు ఇష్టమైన వంట ఇంట్లో చేసుకొని తినడమే మంచిది.. లేకపోతే ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేసేస్తాయి.

Also read: Vaastu tips: డబ్బులు, సంతోషం రెండూ కావాలా?..అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి

 

Exit mobile version