Vaastu tips: డబ్బులు, సంతోషం రెండూ కావాలా?..అయితే ఈ వాస్తు చిట్కాలు పాటించండి
Vaastu tips: ఇంట్లో శుభం, సంపద కోసం కుందేలు, చేపలు, తాబేలు వంటి వాస్తు చిట్కాలు పాటించండి. సానుకూల వాతావరణం, ఆర్థిక శ్రేయస్సు పొందండి!

Vaastu tips :
ఎవరైనా సరే, తమ జీవితంలో ఎలాంటి కష్టాలు, సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గొడవలు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో చాలామంది హిందూ సంప్రదాయంలో భాగమైన వాస్తు శాస్త్రాన్ని ఆశ్రయిస్తుంటారు. వాస్తు నియమాలను సరిగ్గా పాటిస్తే ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, డబ్బుకు లోటు లేకుండా సుఖసంతోషాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు.
వాస్తు పండితుల ప్రకారం, కొన్ని జీవరాశులను ఇంట్లో పెంచుకోవడం లేదా వాటి బొమ్మలను ఉంచుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అవి సంపదను, శ్రేయస్సును తీసుకువస్తాయని చాలామంది విశ్వసిస్తారు. మరి అవేంటో చూద్దాం.
వాస్తు శాస్త్రం (Vaastu tips) ప్రకారం, కుందేలు(Rabbit)ను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో తెల్ల కుందేలును పెంచుకోవడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల వాతావరణం ఉంటుందని నిపుణులు చెబుతారు. ఇది ఇంటికి శుభాలను తీసుకురావడంతో పాటు, ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుందని నమ్మకం. కుందేలు ఉన్న ఇంట్లో ప్రతి పని అనుకూలంగా జరుగుతుందని చెబుతారు. మీరు కుందేలును నిజంగా పెంచుకోలేకపోతే, దాని బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతారు.

వాస్తు ప్రకారం(Vaastu tips), ఇంట్లో చేప(Fish)లను పెంచుకోవడం చాలా శుభప్రదమని చాలామంది నమ్ముతారు. చేపలను ఆక్వేరియంలో పెంచుకుంటే వాటి వల్ల సుఖసంతోషాలు, ఇంట్లో శాంతి నెలకొంటాయని అంటారు. ఎటువంటి గొడవలు లేకుండా కుటుంబ సభ్యుల మధ్య ఆనందం ఉంటుందని నమ్ముతారు. చేపలు సంపదకు చిహ్నంగా చూస్తారు కాబట్టి, ఇవి ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని విశ్వసిస్తారు. అందుకే చాలామంది చిన్నదో, పెద్దదో ఏదో ఒక ఆక్వేరియాన్ని ఇంట్లో పెట్టుకుంటారు.
వాస్తు ప్రకారం(Vaastu tips), తాబేలు(tortoise)ను ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదమని చెబుతారు. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాబేలు బొమ్మను ఉంచితే, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. ఒకవేళ మీ ఇంటికి అకస్మాత్తుగా తాబేలు వస్తే, అది ఊహించని ఆర్థిక లాభాలకు సంకేతమని వాస్తు పండితులు చెబుతారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం వాస్తు శాస్త్రం , సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి. వీటిని శాస్త్రీయంగా రుజువు చేయబడలేదు. ఇలాంటి నమ్మకాలను ప్రోత్సహించడం జస్ట్ తెలుగు వెబ్‌సైట్ ఉద్దేశ్యం కాదు, కేవలం ప్రజల విశ్వాసాలను తెలియజేయడం మాత్రమే. ఈ సమాచారాన్ని వ్యక్తిగత ఆసక్తి కోసం మాత్రమే పరిగణించాలని సూచిస్తున్నాము.
Also Read: Kingdom :ఈ కింగ్డమ్ ఒక ఇద్దరు అన్నదమ్ముల ప్రేమ కథ !
Pawan Kalyan: దజీట్ పవన్ కళ్యాణ్ అని ఇందుకే అంటారేమో..