Father : గుండెలు పగిలే దృశ్యం..కొడుకు ఇష్టాన్ని గౌరవిస్తూ ఓ తండ్రి చేసిన పని

Father : కొడుకు అంతిమ సంస్కారాలలోనూ అతని ఇష్టాలేంటో ఆలోచించిన ఓ తండ్రి చేసిన పని ..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Father

వృద్దాప్యంలో తమకు బాసటగా ఉంటాడనుకున్న కన్నబిడ్డ..కళ్ల ముందే చనిపోతే ఆ తల్లిదండ్రుల(Father)బాధ ఎలా ఉంటుందో ఎవరూ వర్ణించలేరు. గుండెలు పగిలే ఆ బాధను, ఆ వేదనను తట్టుకోవడం అసాధ్యం. అయితే కొడుకు అంతిమ సంస్కారాలలోనూ అతని ఇష్టాలేంటో ఆలోచించిన ఓ తండ్రి చేసిన పని ..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్‌(Gujarat)లో ఇటీవల జరిగిన ఆ సంఘటన గురించి .. సోషల్ మీడియాలో చూసిన వారంతా ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన తమ కొడుకుతో పాటు, అతడికి అత్యంత ఇష్టమైన బైక్‌ను కూడా సమాధి చేసిన తీరు చూసి అందరూ చలించిపోతున్నారు.

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల క్రిష్ పర్మార్( Krish Parmar), ఇటీవలే ఇంటర్మీడియట్ పాస్ అయి, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA)లో చేరాలని కలలు కన్నాడు. ఎంతో ఆనందంగా తాను చేరాలనుకున్న కాలేజీకి వెళ్లి అడ్మిషన్ కూడా తీసుకున్నాడు.

కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా.. ఊహించని విధంగా ఒక ట్రాక్టర్ ట్రాలీని అతడి బైక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన క్రిష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 12 రోజుల పాటు చావుబతుకులతో పోరాడి, చివరికి ప్రాణాలు విడిచాడు.

కన్నకొడుకు మరణంతో క్రిష్ తల్లిదండ్రులు (Father)శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోదిస్తూ, కొడుకు మృతదేహాన్ని అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కూడా తండ్రి సంజయ్ పర్మార్ .. ఒక నిర్ణయం తీసుకున్నారు. క్రిష్‌ ఇంట్లో కారున్నా కూడా తన బైక్‌ అంటేనే తన కొడుకుకు ఇష్టమని.. అతని బట్టలు, బూట్లు బైక్‌ను క్రిష్ డెడ్ బాడీతో సహా సమాధి చేశారు.

ఆ దృశ్యం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించి వేసింది. తన కొడుకుతో పాటు అతని ఇష్టాలను కూడా సమాధిలో ఉంచిన ఆ తండ్రి(Father)వెలకట్టలేని ప్రేమను చూసి, ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమకు సరితూగేది ఏదీ లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Ambati Rambabu: ఫేక్ వీడియోతో మళ్లీ బుక్కయిన అంబటి రాంబాబు..ఈసారి ఏకంగా..

Exit mobile version