Railway tickets:రైల్వే టికెట్ బుకింగ్‌కు ఆధార్ తప్పనిసరి.. ఎందుకు? ఎవరికి లాభం?

Railway tickets:ఇకపై ప్రతి రైల్వే టికెట్ బుకింగ్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చడానికి భారత రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Railway tickets

భారత రైల్వే ప్రయాణికులకు సెప్టెంబర్ 2025 నుంచి ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై ప్రతి రైల్వే టికెట్ బుకింగ్‌కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కీలక నిర్ణయం రైల్వే ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చడానికి భారత రైల్వే శాఖ తీసుకుంది. ఈ మార్పు ఎందుకొచ్చింది? దీని వల్ల ప్రయాణికులకు ఎలాంటి లాభాలు, నష్టాలు ఉంటాయి? తెలుసుకుందాం.

ఎందుకు ఆధార్ తప్పనిసరి అంటే ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.మొదటిది గుర్తింపు , భద్రత. ఆధార్ ఆధారంగా ప్రతి టికెట్(railway tickets) బుకింగ్‌లో ప్రయాణికుడి గుర్తింపు ధ్రువీకరించబడుతుంది. ఇది రైల్వే ప్రయాణంలో మోసాలను, అక్రమ కార్యకలాపాలను, మరియు భద్రతా లోపాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

రెండూ పారదర్శకత, అక్రమాల నియంత్రణ. ఈ నిబంధన వల్ల నకిలీ టికెట్లు, బ్లాక్ మార్కెటింగ్ టికెట్లు వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ప్రయాణికులు తమ టికెట్లను సురక్షితంగా బుక్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇది రైల్వే టికెట్ల నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది.

ఇంతకు ముందు ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సాంకేతిక పరమైన సవాళ్లు, అలాగే ప్రజల హక్కులు, గోప్యత, డేటా భద్రతపై నెలకొన్న ఆందోళనలు ఈ విధానాన్ని ఆలస్యం చేశాయి. అలాగే, స్మార్ట్‌ఫోన్ వినియోగం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు రావచ్చుననే ఉద్దేశంతో దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.

railway tickets

ఈ నిర్ణయం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే..ప్రయాణికులకు ఈ కొత్త నిబంధన వల్ల ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. మోసాలు, అక్రమాలకు భయపడాల్సిన అవసరం ఉండదు. ఇది టికెట్(railway tickets) బుకింగ్ ప్రక్రియను మరింత విశ్వసనీయంగా మారుస్తుంది.

రైల్వేకు లాభాలు..టికెట్ల నిర్వహణలో స్పష్టత పెరుగుతుంది. అక్రమాలు తగ్గుతాయి, దీని ద్వారా రైల్వే ఆదాయం పెరుగుతుంది. అలాగే, ప్రయాణ డేటాను విశ్లేషించడం ద్వారా మెరుగైన సేవలను అందించడానికి వీలు కలుగుతుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నష్టాలు.. డిజిటల్ పరిజ్ఞానం, లేదా ఆధార్ లేని ప్రజలు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలు ఈ నిబంధన వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే, బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు (railway tickets)విక్రయించే వారికి, మధ్యవర్తులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. తమ ఆధార్ డేటా సురక్షితంగా ఉంటుందా అనే ఆందోళన కూడా కొంతమందిలో ఉంది.

ఆధార్ అనుసంధానంతో రైల్వే ప్రయాణం మరింత వేగవంతం కానుంది. భవిష్యత్తులో స్మార్ట్ టికెట్లు, ఆటోమేటిక్ చెక్-ఇన్ కౌంటర్లు అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రయాణికులకు టికెట్ బుకింగ్, ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చివేయనుంది.

Antibiotics :యాంటీబయాటిక్స్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వద్దు?

Exit mobile version