Airtel:ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్..తెలిస్తే అస్సలు మిస్ అవరు..

Airtel:ప్రపంచం అంతా ఏఐతో నిండిపోయింది. ఇందుగలదు అందులేదు ఎందెందు వెతికినా ఏఐనే అన్నట్లుగా ఉంది

Airtel:ప్రపంచం అంతా ఏఐతో నిండిపోయింది. ఇందుగలదు అందులేదు ఎందెందు వెతికినా ఏఐనే అన్నట్లుగా ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది. అందుకే ఇప్పుడు ఎయిర్ టెల్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ తమ యూజర్లకు అద్దిరిపోయే న్యూస్‌ను ఇంట్రడ్యూస్ చేసింది.

Airtel

అవును..ఎయిర్‌టెల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. మొబైల్, వై-ఫై, డీటీహెచ్ (DTH) కస్టమర్లు అనే తేడా లేకుండా, ఎయిర్‌టెల్ యూజర్లు అందరికీ సంవత్సరం పాటు పెర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. ఏఐ (AI) ప్రపంచంలో దూసుకుపోతున్న పెర్‌ప్లెక్సిటీ ప్లాట్‌ఫామ్ ప్రీమియం ఫీచర్లను ఇప్పుడు ఎయిర్‌టెల్ వినియోగదారులు ఫ్రీగా పొందొచ్చు.

పెర్‌ప్లెక్సిటీ ప్రో ఉచితంగా ఎలా పొందాలంటే?

ఈ గురువారం భారతి ఎయిర్‌టెల్, పెర్‌ప్లెక్సిటీతో తమ పార్టనర్‌షిప్‌ను ప్రకటించింది. ఈ డీల్‌లో భాగంగా, ఎయిర్‌టెల్ వినియోగదారులందరికీ పెర్‌ప్లెక్సిటీ ప్రో (Perplexity Pro)ప్లాన్‌కు వన్ ఇయర్ ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ముఖ్యంగా, ఇది ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి లేనప్పుడు కూడా పని చేస్తుంది. ప్రస్తుతం, పెర్‌ప్లెక్సిటీ ప్రో వార్షిక సబ్‌స్క్రిప్షన్ విలువ దాదాపు రూ. 19,600 కావడం విశేషం.

ఈ బంపర్ ఆఫర్‌ను పొందడానికి, ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ థాంక్స్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ పెర్‌ప్లెక్సిటీ ప్రో కోసం ఒక కొత్త బ్యానర్ కనిపిస్తుంది. ఆ బ్యానర్‌ను క్లిక్ చేస్తే, ఈ ఆఫర్ వివరాలు, దాని కాలపరిమితి గురించి సమాచారం కనిపిస్తుంది.

తర్వాత, “ప్రొసీడ్” బటన్‌పై ట్యాప్ చేసి, మీ పెర్‌ప్లెక్సిటీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి (ఒకవేళ ఖాతా లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు). ఖాతాలో లాగిన్ అవ్వగానే, మీ స్టేటస్ ఆటోమేటిక్‌గా ప్రో స్థాయికి అప్‌గ్రేడ్ అవుతుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ మీ పెర్‌ప్లెక్సిటీ ఖాతాకి లింక్ అవుతుంది కాబట్టి, మీరు మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

పెర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రైబర్‌లకు బోలెడన్ని ప్రీమియం లాభాలు అందుబాటులో ఉంటాయి, ఇవి ఫ్రీ వెర్షన్‌లో ఉండవు.

రోజుకు 300 ప్రో సెర్చ్‌లు

థర్డ్-పార్టీ ఏఐ మోడల్స్‌కి యాక్సెస్: జీపీటీ-4.1 (GPT-4.1), ఓ3 (o3), క్లాడ్ 4 సొనెట్ (Claude 4 Sonnet), క్లాడ్ 4 సొనెట్ థింకింగ్ (Claude 4 Sonnet Thinking), జెమిని 2.5 ప్రో (Gemini 2.5 Pro), గ్రోక్ 4 (Grok 4) వంటి అధునాతన ఏఐ మోడల్స్‌ని ఉపయోగించుకోవచ్చు.

పెర్‌ప్లెక్సిటీ ల్యాబ్స్ (Labs) ఫీచర్: ఇటీవల విడుదలైన ఈ ఫీచర్‌తో వినియోగదారులు రిపోర్ట్‌లు, స్ప్రెడ్‌షీట్‌లు, వెబ్ యాప్‌లు కూడా క్రియేట్ చేయొచ్చు.

ప్రో డిస్‌కార్డ్ (Discord) ఛానెల్‌లో చేరే అవకాశం: పెర్‌ప్లెక్సిటీ కమ్యూనిటీలో చేరి చర్చలలో పాల్గొనవచ్చు. మొత్తంగా, ఇది ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఒక పెద్ద బహుమతి అని చెప్పొచ్చు.

 

 

Exit mobile version