India : ముస్లిం దేశాల నాటో కూటమికి భారత్ కౌంటర్..

India : ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీల ఒప్పందాల నేపథ్యంలో భారత్ సహాయం కోసం మహమ్మద్ బిన్ జాయెద్ వచ్చారా అన్న ప్రశ్నలూ వినిపించాయి.

India  :

భారత్ కు మిత్రులు అనుకున్న వారు మన శత్రువులతో చేతులు కలిపి మరో శత్రువుగా మారుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా గతేడాది పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య జరిగిన రక్షణ ఒప్పందమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సౌదీ ఇప్పటికీ మనకు మంచి మిత్ర దేశమే. కానీ, పాకిస్తాన్‌తో అది చేసుకున్న ఒప్పందం ఆ స్నేహంపై అనుమానాలు కలిగేలా చేసింది.

ఇవాళో రేపో టర్కీ అధికారికంగా ఈ ఒప్పందంలో భాగస్వామి కాబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అన్ని ముస్లిం దేశాలు నాటో కూటమిగా ఏర్పడాలని టర్కీ తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇంకా వివరంగా చెప్పాలంటే, భారత్ లక్ష్యంగా ఇస్లామిక్ నాటో కూటమి ఏర్పాటు చకచకా జరుగుతున్నట్టు అర్థమవుతోంది.

సౌదీ అరేబియా దగ్గర ధన బలం , పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధ సామర్థ్యం, టర్కీ దగ్గర సైనిక సామర్థ్యం, ఆయుధ తయారీ కేంద్రం వంటివి ఉన్నాయి. ఇలాంటి మూడు దేశాలు కలిస్తే పశ్చిమాసియా, దక్షిణాసియాలో తమ ఆధిపత్యం కనబరచొచ్చని వారి ప్లాన్ గా తెలుస్తోంది. ఇస్లామిక్ నాటో భారత్‌కు వ్యతిరేకంగా ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అందుకే ఇలాంటి వారికి కౌంటర్ గా భారత్ రివర్స్ ప్లాన్ రెడీ చేస్తోంది. దీనిలో భాగంగానే యూఏఈ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారత్‌కు వచ్చారు. ఇప్పటికే ఆయన భారత పర్యటన అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీల ఒప్పందాల నేపథ్యంలో భారత్ సహాయం కోసం మహమ్మద్ బిన్ జాయెద్ వచ్చారా అన్న ప్రశ్నలూ వినిపించాయి.

India – UAE

ఎందుకంటే, పాకిస్తాన్‌తో చేతులు కలిపిన సౌదీతో యూఏఈకు చాలా సమస్యలున్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో యూఏఈకి భారత్(India – UAE) మాత్రమే నమ్మకమైన భాగస్వామి. ఇంధన భద్రత, సముద్ర మార్గాల రక్షణ, ఉగ్రవాద నిరోధం వంటి అంశాల్లో భారత్ సహకారం యూఏఈకి చాలా అవసరంగా మారింది. ఇదే సమయంలో ఇస్లామిక్ నాటోను ఢీకొట్టడానికి యూఏఈ వంటి ఇస్లామిక్ దేశం అవసరం భారత్(India ) కూ ఉంది. దీంతో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడినట్టు చెప్పొచ్చు.

త్వరలోనే ఇండియా(India) నేతృత్వంలో మెడిటరేనియన్ క్వాడ్ కీలకం కానుంది. ఈ కూటమినే షార్ట్‌కట్‌లో మెడ్ క్వాడ్‌గా పిలుస్తున్నారు.ఈ కూటమి.. సౌదీ-పాకిస్తాన్-టర్కీల కుయుక్తుల కూటమిని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. మోదీ, బిన్ జాయెద్ మధ్య దీని గురించే చర్చ జరిగి ఉంటుందనేది భావిస్తున్నారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version