Waterfall: అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్.. బిగ్‌బీ పేరు వెనుక ఉన్న స్టోరీ!

Waterfall: చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాల మధ్య ప్రవహించే అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్ ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంలా ఉంటుంది.

Waterfall

ప్రకృతి అద్భుతాలు మనల్ని ఎప్పుడూ ఆకర్షిస్తుంటాయి. కానీ ఒక జలపాతానికి మన దేశంలో ఒక సినీ దిగ్గజం పేరు పెట్టారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, ఆ అద్భుతమే అమితాబ్ బచ్చన్ వాటర్ ఫాల్. ఈ జలపాతం ఎత్తైన కొండల నుంచి ఎంతో గంభీరంగా ప్రవహిస్తుంది. స్థానిక ప్రజలు, అమితాబ్ బచ్చన్ వ్యక్తిత్వంలో ఉన్న ఎత్తును, గొప్పతనాన్ని ఈ జలపాతం వైభవంలో చూశారు. అందుకే వారు ఈ జలపాతానికి ప్రేమతో ఆ పేరు పెట్టుకున్నారు.

ఈ అద్భుతమైన జలపాతం(Waterfall) ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచుంగ్, యుమ్‌తంగ్ వ్యాలీలను కలిపే రహదారి పక్కన ఉంది. చుట్టూ దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాల మధ్య ప్రవహించే ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గంలా ఉంటుంది. ఈ జలపాతాన్ని స్థానికంగా భిమ్‌నాలా లేదా భేవ్మా ఫాల్స్ అని కూడా పిలుస్తారు. దారి పొడవునా ఉండే సుందర దృశ్యాలు, స్వచ్ఛమైన గాలి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

Waterfall

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ విషయం అమితాబ్ బచ్చన్‌కు 2019 వరకు తెలియదట. ఒక ట్విట్టర్ యూజర్ దీని గురించి తెలియజేయగానే ఆయన ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఎత్తైన జలపాతా(Waterfall)ల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అలాగే ఇది సముద్రమట్టానికి దాదాపు 8,610 అడుగుల ఎత్తులో ఉంది. గ్యాంగ్‌టక్ నుండి దాదాపు ఏడు గంటల ప్రయాణం చేసి ఈ అద్భుతమైన జలపాతాన్ని చూడొచ్చు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version