UGC : యాంటీ ర్యాగింగ్ వీక్ అమలు చేయాల్సిందే.. యూజీసీ ఆర్డర్

UGC : ఆగస్టు 12 నుంచి 18 వరకు యాంటీ ర్యాగింగ్ వీక్ గా పాటించాలని ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్)కి సూచించింది.

UGC

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఒక ముఖ్యమైన ఆదేశం జారీ చేసింది. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో, ఆగస్టు 12 నుంచి 18 వరకు యాంటీ ర్యాగింగ్ వీక్ గా పాటించాలని ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్)కి సూచించింది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం, ఈ వారం రోజులూ ర్యాగింగ్ నివారణ, అవగాహన కార్యక్రమాలకు కేటాయించాలి.

ఈ వారంలో ఆగస్టు 12వ తేదీని ప్రత్యేకంగా యాంటీ ర్యాగింగ్ డే(Anti-ragging week)గా జరుపుకోవాలని యూజీసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ర్యాగింగ్ లాంటి అమానవీయ చర్యలకు వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది అందరూ కలిసి ముందుకు రావాలని యూజీసీ కోరుతోంది. ఈ కార్యక్రమాలు కేవలం కాలేజీలకే పరిమితం కాకుండా, సమాజానికి కూడా ఒక బలమైన సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని సూచించింది.

ఈ యాంటీ ర్యాగింగ్ వీక్ సందర్భంగా విద్యార్థులను (UGC) భాగస్వామ్యం చేస్తూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని యూజీసీ ఆదేశించింది.పోస్టర్ తయారీ, వ్యాస రచన, వీధి నాటకాలు, డిబేట్స్ వంటివి నిర్వహించి, విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు ఇవ్వాలి.

UGC

నేషనల్ కాంటెస్ట్ 2025′ పేరుతో యాంటీ ర్యాగింగ్ సందేశాలను షార్ట్ వీడియోలు, రీల్స్ రూపంలో ప్రచారం చేయాలి.అలాగే ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలపై వర్క్‌షాప్‌లు, సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలి.

యూజీసీ యొక్క యాంటీ-ర్యాగింగ్ పోర్టల్ antiragging.in ద్వారా అందుబాటులో ఉన్న వీడియోలు, షార్ట్ మూవీలను విద్యార్థులకు చూపించాలి.

ఈ కఠిన ఆదేశాల ద్వారా యూజీసీ, దేశంలోని అన్ని విద్యాసంస్థలు తమ క్యాంపస్‌లను ర్యాగింగ్ రహితంగా, సురక్షితంగా మార్చాలని స్పష్టం చేసింది. ఈ వారం రోజులు జరిగే కార్యక్రమాల వల్ల క్యాంపస్‌లలో సౌభ్రాతృత్వం పెరిగి, విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకోవడానికి వీలవుతుందని యూజీసీ భావిస్తోంది.

Exit mobile version