Award
భారత క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా, అతి చిన్న వయసులోనే అసాధారణ రికార్డులు సృష్టిస్తున్న ఈ పద్నాగేళ్ల కుర్రాడికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2025(Award)’ అందుకున్నాడు. క్రీడా విభాగంలో దేశం గర్వించేలా రాణించినందుకు వైభవ్‌ను ఈ పురస్కారం వరించింది.
వైభవ్ సూర్యవంశీ 2011, మార్చి 27న బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా, తాజ్‌పూర్ గ్రామంలో జన్మించాడు. 2011లో భారత్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఐదు రోజులకే వైభవ్ పుట్టడం విశేషం.
Vaibhav Suryavanshi felicitated with the national child award by the President of India.
– Vaibhav achieving greatness at 14. 👏 pic.twitter.com/gpVzGoRl6Y
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2025
వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఒక సాధారణ రైతు. ఆయనకు కూడా చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తన కొడుకులో ఉన్న ఈ ప్రతిభను గుర్తించి, వైభవ్ కేవలం 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఇంటి వెనుక ఒక చిన్న పిచ్ తయారు చేయించారు. కొడుకు క్రికెట్ కల కోసం సంజీవ్ తనకున్న కొంత భూమిని కూడా కొడుకు కోసం అమ్మేసి, వైభవ్‌ను సమస్తిపూర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్నాలోని అకాడమీకి శిక్షణ కోసం పంపేవారు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో తన కలను నెరవేర్చుకోవడమే కాదు.. తండ్రి ఆశను కూడా తీర్చాడు వైభవ్.
రికార్డుల(Award) ప్రస్థానం:
రంజీ ట్రోఫీ రికార్డ్.. కేవలం 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన వైభవ్.. ఆధునిక క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఐపీఎల్ సంచలనం.. 2025 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ వైభవ్‌ను 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. 14 ఏళ్ల 23 రోజుల వయసులో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించాడు.
వేగవంతమైన సెంచరీ.. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి, క్రిస్ గేల్ తర్వాత అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా, భారత్ తరపున మొదటి బ్యాటర్‌గా
సూర్యవంశీ నిలిచాడు.
యూత్ టెస్ట్ క్రికెట్.. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై 58 బంతుల్లోనే సెంచరీ బాదిన ఈ చిచ్చరపిడుగు, ప్రపంచ యూత్ టెస్ట్ చరిత్రలో భారత్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.
విజయ్ హజారే విధ్వంసం.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లోనే 190 పరుగులు (16 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి, లిస్ట్-ఏ క్రికెట్‌లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా అబ్ డివిలియర్స్ రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టాడు.
వైభవ్ సూర్యవంశీ కేవలం రికార్డులు(Award) మాత్రమే కాదు, మైదానంలో అతని బ్యాటింగ్ శైలి చూస్తుంటే వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారాను గుర్తుకు తెస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ బాల పురస్కారం అందుకున్న వైభవ్, త్వరలోనే జింబాబ్వే వేదికగా జరగబోయే అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ తరపున ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. ఇలాగే వైభవ్ తన ఫామ్ కొనసాగిస్తే, అతిన తక్కువ కాలంలోనే మనం వైభవ్‌ను టీమ్ ఇండియా మెయిన్ టీమ్‌లో చూసే అవకాశం ఉంది.
