Women
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని పట్టాలెక్కించింది. కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా.. మహిళలు(Women) తమ ఊరిలోనే ఉండి నెలకు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న ఈ పథకం, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించబోతోంది. మహిళలను కేవలం గృహిణులుగానే కాకుండా, డిజిటల్ వ్యవస్థలో భాగస్వాములను చేస్తూ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా ఈ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది.
ఈ పథకం ప్రధానంగా స్వయం సహాయక సంఘాలు (SHG), డ్వాక్రా మహిళల కోసం రూపొందించబడింది. దీనివల్ల డ్వాక్రా మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
డిజిటల్ నైపుణ్యం-కంప్యూటర్ వాడకం, ఆన్‌లైన్ సేవలు , డిజిటల్ బ్యాంకింగ్‌పై ప్రభుత్వమే ఫ్రీగా ట్రయినింగ్ ఇస్తుంది.
సొంత వ్యాపారం- ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్ అందజేస్తుంది. ట్రయినింగ్ తర్వాత సెంటర్ ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రూ.50 వేల వరకు తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తుంది.
స్థిరమైన ఆదాయం- రైలు, బస్సు టికెట్ల బుకింగ్, ప్రభుత్వ పథకాల దరఖాస్తులు, పాన్ కార్డ్, ఆధార్ సేవలు , ఈ-కామర్స్ ఆర్డర్ల ద్వారా కమిషన్ రూపంలో ఇన్కమ్ పొందొచ్చు.
దీదీకా దుకాణ్- ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హోల్‌సేల్ ధరకే వస్తువులను తెప్పించి, గ్రామీణ ప్రజలకు విక్రయించడం ద్వారా లాభాలు గడించొచ్చు.
దీని కోసం కావాల్సిన అర్హతలు..
దరఖాస్తుదారు కచ్చితంగా డ్వాక్రా (SHG) సంఘంలో సభ్యురాలై ఉండాలి.
నీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలి.
కంప్యూటర్ పరిజ్ఞానంపై ప్రాథమిక అవగాహన ఉండాలి . ఒకవేళ లేకపోయినా ఎలాగో ప్రభుత్వం ట్రయినింగ్ ఇస్తుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా? (Application Process)..
ఈ పథకం గ్రామ పంచాయతీలు , మండల సమాఖ్యల ద్వారా అమలవుతుంది. అప్లై చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి..
సంఘం ద్వారా సంప్రదించాలి- ఆసక్తి గల మహిళలు ముందుగా తాము ఉన్న డ్వాక్రా సంఘం లీడర్‌ను కానీ గ్రామ సంఘం (VO) అధికారులను సంప్రదించాలి.
పంచాయతీ కార్యాలయం- గ్రామ పంచాయతీ పరిధిలో లబ్ధిదారుల సెలక్షన్ జరుగుతుంది. అక్కడ కంప్యూటర్ దీదీ పోస్టుకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్ పొందాలి.
డాక్యుమెంట్లు- దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు, డ్వాక్రా సంఘం సభ్యత్వ పత్రాలు , ఫోటోలను జత చేయాలి.
ట్రయినింగ్‌కు ఎంపిక- దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వారిలో తగిన వారిని ఎంపిక చేసి ప్రభుత్వ శిక్షణా కేంద్రాలకు పంపుతారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ల్యాప్‌టాప్ , సర్టిఫికెట్ అందజేస్తారు.
బ్యాంక్ లింకేజీ-సెంటర్ ఏర్పాటు కోసం అవసరమైన ఫర్నిచర్, ఇంటర్నెట్ సౌకర్యాల కోసం బ్యాంక్ లోన్ ప్రక్రియను మండల సమాఖ్య అధికారులు దగ్గరుండి పూర్తి చేస్తారు.
తమ ఊరిని విడిచి వెళ్లకుండానే, డిజిటల్ సేవలను ప్రజలకు అందిస్తూ ..ఆర్థికంగా ఎదగడానికి మహిళలకు(Women) ఇది ఒక సువర్ణావకాశమే. ఆసక్తి గల డ్వాక్రా మహిళలు వెంటనే తమ గ్రామ సమాఖ్య అధికారులను సంప్రదించి ఈ పథకం వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.
WhatsApp: వాట్సాప్ వేదికగా స్టాక్ మార్కెట్ పేరుతో దోపిడీ..ఎలా బయటపడాలి?
