Registered post: రిజిస్టర్డ్ పోస్టు నిలుపుదలపై కేంద్రం క్లారిటీ – స్పీడ్ పోస్టులో విలీనం

Registered post: రిజిస్టర్డ్ పోస్టు (Registered post)సేవ నిలిపేస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవ రద్దు అవుతుందని వస్తున్న వార్తలు ప్రజల్లో గందరగోళం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఆ వార్తలపై క్లారిటీ

Registered post

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టంగా మారింది. చాలామంది ఏదో ఒక ప్రచారంలో ఉన్న వార్తలను నిజమని నమ్మి, గందరగోళానికి గురవుతున్నారు.

బ్రిటిష్ పాలన కాలం నుంచే దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న రిజిస్టర్డ్ పోస్టు (Registered post)సేవ నిలిపేస్తున్నారని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్ 1 నుంచి ఈ సేవ రద్దు అవుతుందని వస్తున్న వార్తలు ప్రజల్లో గందరగోళం రేపాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

Registered post

ప్రచారంలో ఉన్నట్లుగా రిజిస్టర్డ్ పోస్టు(registered post)ను పూర్తిగా నిలిపివేయడం జరగదని, అసలు ఈ సేవను రద్దు చేయడమే ఉద్దేశం కాదని కేంద్రం తెలిపింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ, రిజిస్టర్డ్ పోస్టు ఇప్పుడు స్పీడ్ పోస్టు(speed post)లో విలీనం కానుందని వెల్లడించింది. అంటే, సేవ కొనసాగుతుంది కానీ కొత్త విధానంలో ఉంటుంది.

తపాలా శాఖ ఇప్పటికే అన్ని సర్కిళ్ల పరిధిలోని మెయిల్ ఆపరేషన్ డివిజన్లకు ఆదేశాలు పంపింది. కొత్త విధానం 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. రిజిస్టర్డ్ పోస్టు పంపినప్పుడు ఇప్పటివరకు లాగా డెలివరీ రసీదు, రియల్ టైమ్ ట్రాకింగ్ సౌకర్యాలు అందుతాయి. మార్పు ఏంటంటే, ఈ సేవ ఇక స్పీడ్ పోస్టు సిస్టమ్‌లో భాగం అవుతుంది.

ఈ నిర్ణయం వెనుక కారణాల గురించి తపాలా శాఖ చెబుతుందేంటి అంటే.. ఆధునిక అవసరాలకు అనుగుణంగా సేవల వేగం పెంచడం, వినియోగదారులకు సులభమైన ట్రాకింగ్ సౌకర్యాలు కల్పించడం, వివిధ పోస్టల్ సేవలను ఒకే గొడుగు కిందకి తెచ్చి మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యమని.

అందువల్ల, రిజిస్టర్డ్ పోస్టు (Registered post) పూర్తిగా రద్దు అవుతుందని వస్తున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమే. ఇకపై ఇది స్పీడ్ పోస్టు సిస్టమ్‌లో భాగంగా, మరింత వేగంగా, ఆధునిక సౌకర్యాలతో అందుబాటులో ఉండనుంది.

Exit mobile version