Gold Rate
ఆగస్టు మొదటి వారం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. భారత్-అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న సుంకాల వివాదం ప్రభావం కారణంగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు 2 నుంచి 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 6,000 పైగా పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ తగ్గుదల కనిపించింది. రాబోయే పండుగ సీజన్‌లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆగస్టు 12, మంగళవారం నాటి ధరల(Gold price today)ను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 88 తగ్గి రూ. 10,140 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 9,295 వద్ద, 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 7,605 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక 100 గ్రాముల బంగారం ధరలను చూస్తే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,800 తగ్గి రూ. 10,14,000గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల ధర రూ. 8,000 తగ్గి రూ. 9,29,500 వద్ద, 18 క్యారెట్ల బంగారం(gold) ధర రూ. 6,600 తగ్గి రూ. 7,60,500 వద్ద ఉంది.
ప్రధాన నగరాల్లో ధరలు(Gold Rate) (10 గ్రాములకు):
హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం రూ. 1,01,400, 22 క్యారెట్ల బంగారం రూ. 92,950, 18 క్యారెట్ల బంగారం రూ. 76,050.
విజయవాడ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,01,400, 22 క్యారెట్ల బంగారం రూ. 92,950, 18 క్యారెట్ల బంగారం రూ. 76,050.
విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం రూ. 1,01,400, 22 క్యారెట్ల బంగారం రూ. 92,950, 18 క్యారెట్ల బంగారం రూ. 76,050.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,01,400, 22 క్యారెట్ల బంగారం రూ. 92,950, 18 క్యారెట్ల బంగారం రూ. 76,750.
ముంబై: 24 క్యారెట్ల బంగారం రూ. 1,01,400, 22 క్యారెట్ల బంగారం రూ. 92,950, 18 క్యారెట్ల బంగారం రూ. 76,050.
ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 1,01,550, 22 క్యారెట్ల బంగారం రూ. 93,100, 18 క్యారెట్ల బంగారం రూ. 76,180.