T20 World Cup : ధనాధన్ సమరానికి రెడీ..టీ20ల్లో భారత్ కు ఎదురుందా ?

T20 World Cup : ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా నేడు నాగ్ పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది

T20 World Cup

వన్డే సిరీస్ లో పరాజయం పాలైన భారత్ ఇప్పుడు ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తో టీ ట్వంటీ సిరీస్ రెడీ అయింది. ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా నేడు నాగ్ పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది. సొంతగడ్డపై జరగనున్న టీ20 ప్రపంచకప్ (T20 World Cup)కు ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇదే. దీంతో మెగా టోర్నీకి ముందు చివరి రిహార్సల్ లో అదరగొట్టాలని పట్టుదలగా ఉంది.

నిజానికి 2024 టీ ట్వంటీ ప్రపంచకప్ (T20 World Cup) గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్ లో భారత్ కు ఎదురే లేకుండా పోయింది. ఆడిన ప్రతీ సిరీస్ లోనూ విజయం సాధించింది. గత ఏడాది అక్టోబర్ లో ఆసీస్ పైనా, తర్వాత సౌతాఫ్రికాపైనా వరుసగా సిరీస్ విజయాలతో దుమ్మురేపింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. పైగా వరల్డ్ కప్ కు ముందు టీం కాంబినేషన్ విషయంలో ప్రయోగాలు చేసుకునేందుకు కూడా ఇదే చివరి అవకాశం.

అయితే తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ గాయాలతో దూరమవడం ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. వీరి స్థానాల్లో శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్ చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు తుది జట్టు ఎంపిక సవాల్ గా మారింది. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఖాయం. అయితే మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. నాలుగో స్థానంలో సూర్యానే ఆడనున్నాడు.

T20 World Cup

పైగా ఈ సిరీస్ సూర్యకుమార్ బ్యాటింగ్ సత్తాకు పరీక్షగా చెప్పొచ్చు. ఎందుకంటే గత ఏడాది కాలంగా టీ ట్వంటీ ప్రపంచకప్( T20 World Cup) సూర్యకుమార్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. జట్టు విజయాలు సాధిస్తూ స్కై మాత్రం రాణించడం లేదు. దీంతో ప్రపంచకప్ కు ముందు ఫామ్ లోకి వచ్చేందుకు ఈ సిరీస్ మంచి ఛాన్స్. ఐదో ప్లేస్ లో హార్థిక్ పాండ్యా ఆడతాడు. ఇదిలా ఉంటే బౌలింగ్ కాంబినేషన్ లో స్పెషలిస్ట్ స్పిన్నర్ గా వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయం. అలాగే ఆల్ రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ కూడా ఉంటాడు. ఇక పేస్ విభాగంలో బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ ఆడనున్నారు.

మరోవైపు వన్డే సిరీస్ విజయంతో జోష్ మీదున్న న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ సిరీస్ లోనూ శుభారంభం చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్ , కాన్వే వంటి స్టార్ ప్లేయర్స్ తో కివీస్ బ్యాటింగ్ లైనప్ కూడా బలంగానే ఉంది. అటు బౌలింగ్ లో కెప్టెన్ శాంట్నర్ తో పాటు ఇష్ సోధి , జాకబ్ డఫీ కీలకం కానున్నారు. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న నాగ్ పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా.

Garuda Purana:గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ? అది అమంగళమా? శుభప్రదమా?

Exit mobile version