Kashi:కాశీ వెళ్తున్నారా? ఆ దేవుడిని దర్శించుకోకపోతే మీ యాత్ర అసంపూర్ణమే

Kashi: నిజానికి భైరవుడు అంటే భయం కలిగించేవాడు కాదు, మనలోని భయాన్ని హరించేవాడు అని అర్థం.

Kashi

హిందువుల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ (వారణాసి). ఈ నగరానికి అధిపతి విశ్వేశ్వరుడు అయినా కూడా, ఆ నగర రక్షణ బాధ్యతలు , పరిపాలన అంతా కాలభైరవుడి ఆధీనంలో ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కాలభైరవుడిని కాశీ కొత్వాల్ (కాశీ నగర రక్షక అధికారి) అని పిలుస్తారు.

అందుకే కాశీ (Kashi) విశ్వనాథుడిని దర్శించుకున్న ఏ భక్తుడైనా సరే కాలభైరవుడిని దర్శించుకోకపోతే ఆ యాత్ర పూర్తి కాదని.. ఆ పుణ్యం దక్కదని భక్తుల నమ్ముతారు. కాలభైరవుడు అంటే సాక్షాత్తూ శివుడి అంశే. శివుడికి కోపం వచ్చినప్పుడు ఉద్భవించిన రూపమే ఈ భైరవ రూపం.

కాశీ (Kashi) నగరంలో ప్రవేశించే ఏ వ్యక్తికైనా, అక్కడ నివసించే వారికైనా కాలభైరవుడి అనుమతి తప్పనిసరిగా ఉండాలని పండితులు చెబుతారు. ఆయనను దర్శించుకోవడం వల్ల మనలో ఉన్న భయం, అహంకారం ,కాలం పట్ల ఉన్న అశ్రద్ధ తొలగిపోతాయట. కాలభైరవుడి వాహనం కుక్క, అందుకే కాశీలో కుక్కలను గౌరవంగా చూస్తారు.

అంతేకాదు ఇక్కడ కాలభైరవుడికి చేసే పూజలు చాలా విశిష్టంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయనకు నల్లటి దారాన్ని (భైరవ తాయెత్తు) సమర్పించి, దానిని మెడలో లేదా చేతికి కట్టుకుంటే దృష్టి దోషాలు, గ్రహ దోషాలు ,శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. నిజానికి భైరవుడు అంటే భయం కలిగించేవాడు కాదు, మనలోని భయాన్ని హరించేవాడు అని అర్థం.

Kashi

ఆధ్యాత్మికంగా చూస్తే, కాలభైరవుడు కాలాన్ని శాసించే దేవుడు అని అర్ధం. సమయాన్ని వృధా చేసే వారికి, అన్యాయం చేసే వారికి ఆయన శిక్ష తప్పదని చెబుతారు. కాశీలో ఎవరైనా మరణిస్తే, వారి కర్మలను బట్టి ఇచ్చే శిక్షలను కాలభైరవుడే నిర్ణయిస్తాడట. దీనినే భైరవ యాతన అని పిలుస్తారు. అందుకే కాశీకి వెళ్లినప్పుడు ఎంతో భక్తితో, వినయంతో కాలభైరవ స్వామిని ప్రార్థించాలి.

ఈ ఆలయం కాశీలోని విశ్వనాథ ఆలయానికి కొంచెం దూరంలో ఉంటుంది. ప్రతిరోజూ ఇక్కడ జరిగే హారతి కార్యక్రమం అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడు కాశీకి వెళ్లినా, మొదట లేదా చివరగా ఆ కొత్వాల్ అనుమతి తీసుకుని మీ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

Garuda Purana:గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా ? అది అమంగళమా? శుభప్రదమా?

 

Exit mobile version