Cough Syrup: భారత కల్తీ దగ్గు మందుల స్కాండల్.. WHO అత్యవసర హెచ్చరికలు

Cough Syrup: ఈ విషాదం కారణంగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని పరాసియా పట్టణంలో సహా దేశవ్యాప్తంగా మొత్తం 22 మంది చిన్న పిల్లలు (ఎక్కువగా 2–5 సంవత్సరాల లోపు బాలలు) మరణించారు.

Cough Syrup 2025

అక్టోబర్‌లో, భారతదేశంలో తయారైన మూడు దగ్గు మందుల(Cough Syrup)పై..తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర హెచ్చరికలు జారీ చేయడం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

ఈ మూడు సిరప్‌లు – తమిళనాడుకు చెందిన Sresan Pharmaceuticals తయారు చేసిన Coldrif (కోల్డ్రిఫ్), గుజరాత్‌కు చెందిన Rednex Pharmaceuticals తయారు చేసిన Respifresh TR (రెస్పిఫ్రెష్ టిఆర్), గుజరాత్‌కు చెందిన Shape Pharma తయారు చేసిన ReLife (రిలైఫ్). ఈ మందుల్లో Diethylene Glycol (DEG) అనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనం ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా Coldrifలో WHO నిర్దేశించిన పరిమితికి 48 రెట్లు అధికంగా (48.6% వరకు) DEG ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.

ఈ విషాదం కారణంగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలోని పరాసియా పట్టణంలో సహా దేశవ్యాప్తంగా మొత్తం 22 మంది చిన్న పిల్లలు (ఎక్కువగా 2–5 సంవత్సరాల లోపు బాలలు) అధికారికంగా మరణించినట్లు నివేదించారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు. DEG అనేది పారిశ్రామిక సొల్వెంట్, ఇది కిడ్నీలు పూర్తిగా విఫలమవడానికి (Kidney Failure), నరాల సమస్యలకు దారి తీస్తుంది. గతంలో గాంబియా, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల్లోనూ ఇదే DEG కల్తీవల్ల భారతీయ దగ్గు మందుల(Cough Syrup) కారణంగా వందల మంది పిల్లలు మరణించారు.

Cough Syrup

సెప్టెంబర్ 2025 చివరి వారంలో మధ్యప్రదేశ్, చింద్వారాలో పిల్లలు తీవ్ర నొప్పులు, మూత్ర విసర్జన ఆగిపోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రికి చేరడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. డ్రగ్ ల్యాబ్ పరీక్షల్లో DEG అధికంగా ఉండడం తేలడంతో, అధికారులు వెంటనే సిరప్ బ్యాచ్‌లను సీజ్ చేసి, కేంద్ర ఆరోగ్య శాఖకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో FIR నమోదైంది.

దీనిపై తమిళనాడు, గుజరాత్ ప్రభుత్వాలు సంబంధిత కంపెనీల తయారీ లైసెన్సులను పూర్తిగా రద్దు చేశాయి. Sresan Pharma యజమాని G. రంగనాథన్‌ను 300కి పైగా నిబంధనల ఉల్లంఘనల దోషిగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఏడు స్థలాల్లో దాడులు జరిపి, ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని కూడా చేర్చింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2 సంవత్సరాల లోపు పిల్లలకు దగ్గు(Cough Syrup)/జలుబు మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వవద్దని, అన్ని రాష్ట్రాల్లో సిరప్‌ల బ్యాచ్‌లను రీ-టెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ ఘటన భారతదేశంలో తయారైన ఔషధాలపై ఉన్న నాణ్యత నియంత్రణ వ్యవస్థ వైఫల్యాన్ని , భారత ఫార్మా పరిశ్రమ ప్రతిష్టపై తీవ్రమైన ప్రభావాన్ని సూచిస్తోంది.

Team India: వెస్టిండీస్ పై సిరీస్ క్లీన్ స్వీప్ WTCలో భారత్ ప్లేస్ ఎంతంటే ?

Exit mobile version