Milestones: మైల్ స్టోన్స్‌ రంగుల వెనుక ఇంత అర్ధం ఉందా?

Milestones: అశోకుడి కాలంలో రహదారుల వెంట మైలురాళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది.

Milestones

మీరు ప్రయాణం చేస్తుంటే రోడ్డు పక్కన రకరకాల రంగుల్లో మైలురాళ్లు లేదా మైల్ స్టోన్స్ కనిపిస్తాయి. పసుపు, ఆకుపచ్చ, నలుపు.. ఇలా వివిధ రంగులలో ఉంటాయి. ఎప్పుడైనా వాటి రంగుల మధ్య ఉన్న తేడాను గమనించారా? ఆ రంగులు కేవలం అలంకరణ కోసం కాదు, వాటి వెనుక ఒక ముఖ్యమైన అర్థం దాగి ఉంది.

పసుపు రంగు (పైన): మైలురాయి (Milestones)పైభాగం పసుపు రంగులో, దిగువ భాగం తెలుపు రంగులో ఉంటే, మీరు జాతీయ రహదారిపై (National Highway) ప్రయాణిస్తున్నారని అర్థం. దేశంలోని ప్రధాన నగరాలు, రాష్ట్రాల రాజధానులను కలిపే ఈ రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించి, వాటి పర్యవేక్షణ బాధ్యతను చూసుకుంటుంది. ఈ పసుపు రంగు దేశ సమైక్యతకు, ముఖ్యమైన మార్గాలకు చిహ్నంగా ఉంటుంది.

ఆకుపచ్చ రంగు (పైన): మైలురాయి (Milestones)పై భాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే, అవి రాష్ట్ర రహదారులు (State Highway) అని అర్థం. ఈ రోడ్లు ఒక రాష్ట్రంలోని ప్రధాన నగరాలను లేదా జిల్లాలను కలుపుతాయి. వీటి నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి.

నలుపు లేదా తెలుపు రంగు (పైన): మైలురాయి పైభాగం నలుపు రంగులో, కింది భాగం తెలుపు రంగులో ఉంటే, మీరు ఒక పెద్ద నగరం లేదా జిల్లా రహదారిపై (District Highway) ప్రయాణిస్తున్నారని అర్థం. ఈ రహదారి బాధ్యత జిల్లా యంత్రాంగం చూసుకుంటుంది. నగరంలో ప్రయాణించేటప్పుడు ఇవి తరచుగా కనిపిస్తాయి.

ఆరెంజ్ లేదా ఎరుపు రంగు (పైన): మీరు ఆరెంజ్ రంగు మైలురాయిని ఎక్కడైనా చూశారంటే.. దాని అర్థం మీరు గ్రామీణ రోడ్లపై ప్రయాణిస్తున్నారని. ఈ రోడ్లను ఎక్కువగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి గ్రామీణ అభివృద్ధి పథకాల కింద నిర్మిస్తారు. ఈ రంగులు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానం చేస్తాయని సూచిస్తాయి.

Milestones

భారత్‌లో పురాతన కాలం నుంచి ప్రయాణికులకు మార్గదర్శనం చేయడానికి ఇలాంటి సూచికలను ఉపయోగించేవారు. అశోకుడి కాలంలో రహదారుల వెంట మైలురాళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. బ్రిటీష్ పాలనలో కూడా ఇవి మరింత వ్యవస్థీకృతం అయ్యాయి.

ఇవి ప్రయాణికులకు దారిని చూపిస్తాయి. ఒక నిర్దిష్ట ప్రదేశానికి ఇంకా ఎంత దూరం ఉందో స్పష్టంగా తెలుపుతాయి. ఈ రంగుల కోడింగ్ వల్ల డ్రైవర్లు తాము ఏ రహదారిపై ఉన్నారో గుర్తించగలుగుతారు. దాని ప్రకారం వేగాన్ని, జాగ్రత్తలను పాటించవచ్చు. ఏ రహదారి ఎవరి పర్యవేక్షణలో ఉందో అధికారులకు సులభంగా తెలుస్తుంది. దానివల్ల రోడ్డు మరమ్మత్తులు, నిర్వహణ పనులు సులభమవుతాయి. ఈ మైలురాళ్లు గూడ్స్ రవాణా చేసే వారికి, ప్లానింగ్‌లో కూడా చాలా ఉపయోగపడతాయి.

మొత్తానికి, ఈ చిన్నపాటి మైలురాళ్లు(Milestones) కేవలం ఒక సూచిక మాత్రమే కాదు.. మన దేశ రవాణా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. దాని వెనుక ఉన్న ఈ వివరాలు తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది.

Lokesh: టీడీపీ ఫ్యూచర్ లీడర్ లోకేష్.. బలం, బలహీనతలు, ఎదుగుతున్న తీరు

Exit mobile version