Resolutions
నూతన సంవత్సర వేడుకలు రాగానే చాలామంది ఎంతో ఉత్సాహంగా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ (Resolutions)అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే నిర్ణయం తీసుకుంటారు కానీ వారం గడవకముందే వాటిని మర్చిపోతుంటారు కూడా. అందుకే 2026లో మీరు తీసుకునే నిర్ణయాలు అలా మొక్కుబడిగా కాకుండా మీ జీవితాన్ని ఆరోగ్యకరంగా మార్చేలా ఉండాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అవ్వాలి..
ఆరోగ్యం అంటే కేవలం ఫిజికల్ ఫిట్‌నెస్ మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కూడా అని గుర్తించాలి. ఈ కొత్త ఏడాదిలో మీరు పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలను ఇప్పుడు చూద్దాం. వీటిని పాటించడం వల్ల మీరు ప్రతీ రోజూ ఉత్సాహంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా తప్పించుకోవచ్చు.
మొదటిది నీళ్లు తాగే అలవాటు. ఇది వినడానికి చాలా చిన్న విషయంగా అనిపించినా కూడా మన శరీరానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. కిడ్నీ సమస్యలు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.
రెండవది (Resolutions)శారీరక శ్రమ. దీనికోసం మీరు జిమ్‌కు వెళ్లాల్సిన పని లేదు. రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకుంటే చాలు. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. నడవడం అవదు అనుకున్న వాళ్లు యోగా, మెడిటేషన్ ఇలా ఏదో ఒకటి అయినా అలవాటుగా మార్చుకోండి.
మూడవది ఆహారపు అలవాట్లు. బయటి జంక్ ఫుడ్‌ను, ఆయిల్ ఫుడ్, స్వీట్స్ వంటివి పూర్తిగా మానేయకపోయినా కనీసం తగ్గించడానికి ప్రయత్నించండి. ఇంట్లో వండిన తాజా ఆహారం, పండ్లు , ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయే ముందు కనీసం రెండు గంటల ముందే భోజనం పూర్తి చేసే అలవాటు వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.మెయిన్ ఓవర్ వెయిట్ సమస్యకు దూరంగా ఉంటారు.
నాలుగవది అండ్ ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ అయిన ..డిజిటల్ డిటాక్స్. ఉదయం లేచిన వెంటనే స్మార్ట్ ఫోన్ చూడటం మానేయండి. రోజులో కనీసం ఒక గంట పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ.. మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదవడమో లేదా కుటుంబ సభ్యులతో సమయం గడపడమో చేయండి. ఇది మీ మెదడుకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.
ఐదవది నిద్ర. రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢ నిద్ర ఉండటం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది . రోజంతా యాక్టివ్‌గా ఉండగలుగుతారు. ఈ చిన్నచిన్న మార్పులను ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా అలవాటు చేసుకోండి. అంతేకాని రిజల్యూషన్స్ అని మొదలు పెట్టి దానిని మధ్యలో వదిలేయకండి.
