Just NationalLatest News

New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ .. ఏ దేశంలో ముందుగా మొదలై ఏ దేశంలో ముగుస్తాయో తెలుసా?

New Year: ప్రపంచంలో అందరికంటే చివరగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రాంతాలు కూడా ఉన్నాయి.

New Year

ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర (New Year)వేడుకలకు అంతా రెడీ అయిపోయారు. 2026వ సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి ప్రతి దేశం తమదైన శైలిలో రెడీ అవుతోంది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ వేడుకలను ప్రపంచం మొత్తం ఒకే సమయంలో జరుపుకోదు. ఎందుకంటే భూభ్రమణం వల్ల ఒక్కో దేశం ఒక్కో సమయంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంది.

అందరికంటే ముందుగా ‘హ్యాపీ న్యూ ఇయర్(New Year)’ అని చెప్పుకునేది .. పసిఫిక్ మహా సముద్రం నడిబొడ్డున ఉన్న కిరిబాటి అనే ద్వీప దేశంలోని కిరిటిమటి ప్రాంతవాళ్లు. ఈ ప్రాంతాన్నే క్రిస్మస్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడే ప్రపంచంలోనే ఫస్ట్ కొత్త ఏడాది వేడుకలు మొదలవుతాయి. భూమిపై తొలి సూర్య కిరణాలు ప్రసరించే ప్రాంతం తూర్పు ఆసియా , పసిఫిక్ దీవులు కావడమే దీనికి ప్రధాన కారణం.

కిరిటిమటి ద్వీపంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలు అయినప్పుడు మన దేశంలో ..కాలమానం ప్రకారం డిసెంబర్ 31 మధ్యాహ్నం 3.30 గంటలు మాత్రమే అవుతుంది. అంటే భారత్ కంటే సుమారు ఎనిమిదిన్నర గంటల ముందే వారు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.

కిరిబాటి ప్రభుత్వం 1995లో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోని అన్ని ద్వీపాలు ఒకే క్యాలెండర్ , ఒకే టైమ్ జోన్‌ను పాటించాలని నిబంధన తెచ్చింది. అందుకే ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యే తొలి దేశంగా ఇది గుర్తింపు పొందింది. కిరిబాటి తర్వాత సమోవా, టోంగా, టోకెలావ్ , న్యూజిలాండ్ వంటి దేశాల్లో వరుసగా సెలబ్రేషన్స్ మొదలవుతాయి.

New Year
New Year

కిరిబాటి దేశ ప్రజలు మాట్లాడే భాషలో ఒక చిన్న విశేషం ఉంది. వారు తమ దేశం పేరును కిరిబాటి అని రాసినా.. ఉచ్చరించేటప్పుడు మాత్రం ‘కిరిబాస్’ అని పలుకుతారు. ఈ దేశం 1979లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. కిరిబాటిలో వేడుకలు మొదలైన కొద్దిసేపటికే అంటే మన దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ లో.. రాత్రి 9.30 గంటలకు ఆస్ట్రేలియాలో కొత్త ఏడాది సందడి మొదలవుతుంది. రష్యా, ఫిజీ, మార్షల్ దీవులు కూడా కిరిబాటి తర్వాత కొద్ది గంటల గ్యాప్‌లోనే 2026లోకి ప్రవేశిస్తాయి.

మరోవైపు ప్రపంచంలో అందరికంటే చివరగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రాంతాలు కూడా ఉన్నాయి. కిరిబాటిలో వేడుకలు ముగిసిన దాదాపు ఒక రోజు తర్వాత అంటే 25 గంటల ఆలస్యంగా అమెరికన్ సమోవా, బేకర్ ఐలాండ్ , హౌలాండ్ దీవుల్లో జనవరి 1వ తేదీ ప్రారంభమవుతుంది. ఈ దీవులు అమెరికా ఆధీనంలో ఉన్నాయి.

వీటిలో ఒక విశేషం ఏమిటంటే బేకర్ , హౌలాండ్ దీవుల్లో అస్సలు మనుషులే నివసించరు. కేవలం అమెరికా నౌకాదళం ,ఫిషరీస్ విభాగాలు మాత్రమే ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తుంటాయి. సూర్యోదయ వేళల్లో ఈ వ్యత్యాసాలు ఎందుకు వస్తాయంటే భూమి తన చుట్టూ తాను పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతుంది. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి, సహజంగానే తూర్పున ఉన్న దేశాలపై సూర్యకిరణాలు ముందుగా పడతాయి. ఈ మార్పులను బట్టి ప్రపంచాన్ని మొత్తం 24 టైమ్ జోన్లుగా విభజించారు.

ఇక మన దేశం విషయానికి వస్తే మనం కిరిబాటి కంటే ఎనిమిదిన్నర గంటలు ఆలస్యంగా, అమెరికన్ సమోవా కంటే చాలా ముందుగా వేడుకలు (New Year)జరుపుకుంటాం. మన దేశంలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు వేడుకలు జరుగుతున్న సమయంలో.. అమెరికాలో ఇంకా డిసెంబర్ 31 సాయంత్రం సమయంలో ఉంటుంది.

ఇలా ప్రపంచవ్యాప్తంగా టైమ్ జోన్ల వ్యత్యాసం వల్ల నూతన సంవత్సర వేడుకలు దాదాపు ఒక రోజంతా ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. కొన్ని దేశాల్లో సాంస్కృతిక , మతపరమైన క్యాలెండర్లు వేరుగా ఉన్నా , ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1వ తారీఖునే అందరూ అధికారికంగా కొత్త ఏడాదిగా భావిస్తారు.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button