Nitin Nabin : కాషాయ పార్టీకి కొత్త సారథి..ఎవరీ నితిన్ నబిన్ ?

Nitin Nabin : బీజేపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను నియమించారు

Nitin Nabin

భారత జనతాపార్టీ జాతీయ నాయకత్వంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో కొత్త సారథిగా నితిన్ నబిన్ (Nitin Nabin) ఎన్నికయ్యారు. నితిన్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ నేపథ్యంలో నితిన్ నబిన్ గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది నెట్ లో ఆయన గురించి శోధిస్తున్నారు.

రాంఛీకి చెందిన నితిన్ నబిన్ (Nitin Nabin)1980 మే 23న జన్మించారు. ఆయన తండ్రి నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా సీనియర్ బీజేపీ నేతగా ఉన్నారు. పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు బీహార్ శాసనసభ సభ్యుడిగా కిశోర్ ప్రసాద్ సిన్హా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్‌ నుంచి 1998లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన నితిన్ నబిన్.. దీప్‌మాలా శ్రీవాస్తవను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.. ఇదిలా ఉండగా నితిన్ నబిన్ కుటుంబ నేపథ్యం రాజకీయాలే కావడంతో సహజంగానే అటు వైపు వచ్చేశారు.

ఆయన రాజకీయ ప్రస్థానం 2006లో మొదలైంది.పాట్నా వెస్ట్‌ నియోజకవర్గం ఉపఎన్నికలో గెలిచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నియోజకవర్గాల పునర్విభజనతో బాంకిపూర నుంచి పోటీచేసి దానినే కంచుకోటగా మార్చుకున్నారు. 2010, 2015, 2020, 2025 వరుస అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచే విజయం సాధించారు.

Nitin Nabin

తన రాజకీయ ప్రయాణంలో అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ పలు కీలక పదవుల్లో పనిచేశారు. నితీశ్ కుమార్ సారథ్యంలోని బీహార్ ప్రభుత్వంలో నితిన్ నబిన్ (Nitin Nabin) పలు శాఖల మంత్రిగా వ్యవహరించారు. రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మంత్రిగా ఉన్న సమయంలో పాలనాపరంగా తీసుకున్న పలు నిర్ణయాలు నితీశ్ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయి.

ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ ,సంక్షేమ చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టి ప్రశంసలు అందుకున్నారు. నితిన్ నబిన్ బీజేపీ యువ విభాగం నుంచి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ కీలక బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. 2025 డిసెంబర్‌లో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

Harish Rao:హరీశ్ రావుకు సిట్ నోటీసులు..ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకున్నట్లేనా?

Exit mobile version