Railway jobs: రైల్వే జాబ్స్.. ఈ పోస్టులకు ఎవరు అర్హులో తెలుసా?

Railway jobs: అభ్యర్థులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ. 35,400 నుంచి మొదలవుతుంది.

Railway jobs

భారతీయ రైల్వే ఉద్యోగార్థుల(Railway jobs)కు కేంద్ర ప్రభుత్వ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 368 రైల్వే సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటీసు ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది రైల్వే రంగంలో స్థిరమైన, గౌరవప్రదమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.

ఈ ఉద్యోగం ముఖ్యంగా రైల్వే కార్యకలాపాల నిర్వహణ, రైళ్ల నియంత్రణ , పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సాధారణంగా, ఈ పోస్టులకు నిర్దిష్ట విద్యార్హతలు ఉంటాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వేషన్ వర్గాలకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Ganesh Chaturthi: ఈ తప్పులు చేస్తే వినాయక చవితి చేసినా ఫలితం ఉండదు..!

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15, 2025 నుంచి ప్రారంభమై, అక్టోబర్ 14, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ. 35,400 నుంచి మొదలవుతుంది. ఈ ఉద్యోగం కేవలం జీతం మాత్రమే కాకుండా, మెడికల్, పెన్షన్ వంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉండే అన్ని రకాల ప్రయోజనాలతో కూడిన జీవన ప్రమాణాన్ని (quality of life) అందిస్తుంది.”
ఎంపిక ప్రక్రియ సాధారణంగా రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ – CBT), దాని తర్వాత దరఖాస్తుల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్) అలాగే వైద్య పరీక్షల ద్వారా జరుగుతుంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యాక, పరీక్ష విధానం, సిలబస్, జోన్ల వారీగా ఖాళీలు, ఇతర ముఖ్యమైన నియమ నిబంధనల గురించి మరింత స్పష్టత లభిస్తుంది.
అహ్మదాబాద్, చెన్నై, సికింద్రాబాద్, కోల్‌కతా వంటి 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల(Railway jobs)

railwayjobs

ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను తప్పకుండా విజిట్ చేయండి.

 

 

Exit mobile version