Ganesh Chaturthi: ఈ తప్పులు చేస్తే వినాయక చవితి చేసినా ఫలితం ఉండదు..!
వినాయక చవితి(Ganesh Chaturthi) పూజ నిమజ్జనంతో పూర్తవుతుంది. విగ్రహాన్ని ప్రతిష్టించి, ఎంత భక్తితో పూజిస్తారో, నిమజ్జనం కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేయాలి.

Ganesh Chaturthi
ప్రతి శుభకార్యాన్ని ప్రారంభించే ముందు మొదటగా పూజ అందుకునేది విఘ్ననాయకుడైన వినాయకుడే. ఆయనను పూజించకుండా చేసే ఏ కార్యమూ, ఏ పూజా అసంపూర్ణమే. అలాంటి వినాయకుడిని ప్రత్యేకంగా పూజించే పండుగే వినాయక చవితి. ఈ ఏడాది వినాయక చవితి ఆగష్టు 27, బుధవారం నాడు జరుపుకోనున్నారు. ఉదయం 11:05 నుంచి 01:40 మధ్యాహ్నం వరకు పూజకు శుభ సమయంగా పండితులు సూచిస్తున్నారు.
భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్థి తిథి (Ganesh Chaturthi) ఆగష్టు 26న మధ్యాహ్నం 01:54కి ప్రారంభమై, ఆగష్టు 27న మధ్యాహ్నం 03:44కి ముగుస్తుంది. భారతదేశంలో చాలా చోట్ల గణేశ నవరాత్రులు జరుపుకొంటారు, ఈ పండుగ సెప్టెంబర్ 6, శనివారం రోజు నిమజ్జనంతో ముగుస్తుంది.ఈ పండుగ రోజు కొన్ని నియమాలు పాటించకపోతే పూజకు తగిన ఫలితం లభించదని పురాణాలు చెబుతున్నాయి.
Railway jobs: రైల్వే జాబ్స్.. ఈ పోస్టులకు ఎవరు అర్హులో తెలుసా?
వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు దాని దిశ చాలా ముఖ్యం. ఎప్పుడూ విగ్రహం ముఖం ఈశాన్యం లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులు శుభప్రదమైనవిగా భావిస్తారు, ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, ప్రతికూల శక్తులను తొలగిస్తాయని నమ్ముతారు. అశుభ దిశలో విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి, ఇబ్బందులు ఏర్పడొచ్చు. అలాగే, విగ్రహాన్ని నేరుగా నేలపై పెట్టడం కూడా పెద్ద అపరాధంగా పరిగణిస్తారు. విగ్రహాన్ని చెక్క పీటపై లేదా శుభ్రమైన, ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల పూజ ప్రభావవంతంగా ఉంటుంది.
అనేకమంది ఒకేచోట ఒకటి కంటే ఎక్కువ గణేశ విగ్రహాలను ప్రతిష్టిస్తుంటారు. అయితే, ఒకే పూజా స్థలంలో ఒకే విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉంటే పూజ ప్రభావం తగ్గుతుందని, భక్తులలో గందరగోళం ఏర్పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. పూజ కోసం ఎల్లప్పుడూ పూర్తిగా, మంచి స్థితిలో ఉన్న విగ్రహాన్ని మాత్రమే ఎంచుకోవాలి. విరిగిన లేదా అసంపూర్ణంగా ఉన్న విగ్రహాలను ఉపయోగించకూడదు. అలాగే విగ్రహం లోపల డొల్లగా ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయని నమ్మకం.
వినాయకుడికి పూజలో మొగలి పువ్వులు (కేతకి పువ్వులు) సమర్పించడం నిషేధించబడింది. శివుడి శాపం కారణంగా ఈ పువ్వులు పూజకు పనికిరావు. వినాయకుడికి గరిక (దూర్వా గడ్డి), ఎర్రటి మందార పువ్వులు, ఉండ్రాళ్లు, మోదకం వంటి ప్రసాదాలు సమర్పించడం చాలా శుభప్రదం.
వినాయక చవితి(Ganesh Chaturthi) పూజ నిమజ్జనంతో పూర్తవుతుంది. విగ్రహాన్ని ప్రతిష్టించి, ఎంత భక్తితో పూజిస్తారో, నిమజ్జనం కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేయాలి. పూజ, వ్రత కథ, ఉద్వాసన లేకుండా తొందరపడి నిమజ్జనం చేయడం సరికాదు. మంత్రాలు చదువుతూ, భక్తితో విగ్రహాలను నీటిలో జాగ్రత్తగా వదలాలి, విసిరివేయకూడదు. ఈ నియమాలన్నీ పాటించినప్పుడే వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి.
2 Comments