Railway parcel:రైల్వే పార్శిల్ పంపాలంటే ఇక స్టేషన్‌కు వెళ్లక్కర్లేదు.. ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చు

Railway parcel:మీరు యాప్‌లో బుక్ చేస్తే చాలు, రైల్వే ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి మరీ ఆ పార్శిల్ సేకరిస్తారు.

Railway parcel

ఇండియన్ రైల్వే కూడా ఇప్పుడు డిజిటల్ బాట పట్టింది. ప్రయాణికులకే కాదు.. పార్శిళ్లు పంపే వారికి కూడా సరికొత్త సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఎవరైనా సరే ఏదైనా వస్తువును ఒక ఊరి నుంచి మరో ఊరికి పంపాలంటే రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో ఒక్క.. రైల్ పార్శిల్(Railway parcel) బుకింగ్ యాప్ ఉంటే చాలు.. ఇంటి వద్ద నుంచే మన పార్శిల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈరోజు అంటే ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో.. జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ఈ రైల్ పార్శిల్(Railway parcel) బుకింగ్ యాప్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ యాప్ ద్వారా డోర్ స్టెప్ పికప్ ఉంటుంది. మీరు యాప్‌లో బుక్ చేస్తే చాలు, రైల్వే ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి మరీ ఆ పార్శిల్ సేకరిస్తారు. దీనివల్ల ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే దూర ప్రాంతాలలో మనకు కావాల్సిన వారికి నచ్చిన వస్తువులను పంపొచ్చు.
అంతేకాదు దీనిలో రియల్ టైమ్ ట్రాకింగ్ సర్వీస్ కూడా ఉంటుంది. మీ పార్శిల్ ఇప్పుడు ఏ స్టేషన్‌లో ఉంది? ఎప్పుడు డెలివరీ అవుతుందనే విషయాలను లైవ్‌లో ట్రాక్ చేయొచ్చు.తంలో లాగా ఇప్పుడు క్యూలో నిలబడాల్సిన పనిలేదు. ఫారాలు నింపడం, క్యూలలో వేచి ఉండటం వంటి ఇబ్బందులు ఇక ఉండవు.

Railway parcel

ముందుగా హైదరాబాద్ డివిజన్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ సర్వీస్.. సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్యమయిన నగరాలకు విస్తరించారు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నగరాలకే పరిమితమైన ఈ సేవలు, త్వరలోనే ఇతర జోన్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది.

చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు తమ సరుకులను కస్టమర్లకు పంపడానికి ఈ యాప్ ఒక వన్-స్టాప్ సొల్యూషన్‌లా పనిచేయబోతోంది. లాజిస్టిక్ పార్టనర్లు, పరిశ్రమలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తంగా రైల్వే చరిత్రలో ఇలాంటి డిజిటల్ మార్పును ఇంట్రడ్యూస్ చేసిన మొదటి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే సరికొత్త రికార్డు సృష్టించింది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version