Gold Scam: శబరిమల గోల్డ్ స్కామ్ పెళ్ళి కోసం దేవుడి బంగారం

Gold Scam: ఆలయ విగ్రహాలకు, విలువైన వస్తువులకు తన సొంత ఖర్చుతో బంగారు పూత వేయించేందుకు టీడీబీ నుంచి అనుమతి పొందారు.

Gold Scam

శబరిమల ఆలయం ఎంతటి ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలుసు… దేశవ్యాప్తంగా లక్షలాది భక్తులు నిష్టగా పూజించే అయ్యప్ప వెలసిన దేవాలయం.. అలాంటి ప్రాముఖ్యత ఉన్న శబరిమల ఆలయం వివాదాలకు చిరునామాగా మారుతోంది. భక్తులు అత్యంత విశ్వాసంతో స్వామికి సమర్పించే బంగారంలో పెద్ద స్కామ్ చోటు చేసుకుంది. ఈ స్కామ్ లో విచారణ జరిపే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఆలయంలో బంగారం మాయం కావడంతీవ్ర సంచలనంగా మారింది. దీంతో భారీ కుంభ కోణం జరిగిందని గ్రహించిన కేరళ హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం… తర్వాత దర్యాప్తులో పలు కీలకాంశాలు వెలుగులోకి రావడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ బంగారం మాయమైన ఎపిసోడ్ లో కర్త , కర్మ , క్రియ పూర్తిగా స్పాన్సర్ దేనని తెలిసింది.

Gold Scam

ఎందుకంటే స్పాన్సర్ రాసిన ఓ లేఖ ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారుతోంది. 2019లో ద్వారపాలక విగ్రహాలకు బంగారు పూత పూయడానికి స్పాన్సర్ గా ఉన్నచేసిన ఉన్నికృష్ణన్ పొట్టి దానిలో మిగిలిన బంగారాన్ని పెళ్ళికి ఉపయోగించాలని భావించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రస్టుకు లేఖ రాశాడు. ఉన్నికృష్ణన్ పొట్టి.. 2019 డిసెంబర్ 9వ తేదీన టీడీబీకి సారిన లేఖలో ఓ బాలిక వివాహం కోసం మిగిలిన బంగారం ఉపయోగించుకునేందుకు అనుమతి కోరాడు. మరోవైపు అసలు బంగారు పూత పూసిన ద్వారపాలకుల విగ్రహాలపై బంగారాన్ని అమ్మేసి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేశారని విచారణలో తేలింది.

ఆలయ విగ్రహాలకు, విలువైన వస్తువులకు తన సొంత ఖర్చుతో బంగారు పూత వేయించేందుకు టీడీబీ నుంచి అనుమతి పొందారు. దీని కోసం టీడీబీ 42.8 కిలోల బరువున్న వస్తువులను ఉన్నికృష్ణన్ పొట్టికి అందజేసింది. కానీ బంగారం పూత పని పూర్తయిన తర్వాత వాటి బరువు 38.258 కిలోలకు తగ్గిపోయింది. బరువు తగ్గిన విషయాన్ని టీడీబీ సీరియస్ గా తీసుకోలేదు సరికదా మరోసారి బంగారు పూత పనులను అదే కూడా టీడీబీ మళ్ళీ ఉన్నికృష్ణన్ పొట్టికే అప్పగించడం అనుమానాలకు తావిస్తోంది.

Gold Scam

ప్రస్తుతం ఆలయంలో బంగారం మాయమయిన వ్యవహారంపై కోర్టు విజిలెన్స్ అధికారులను రిపోర్ట్ ఇవ్వాలని కోరింది. నివేదికలో బంగారం దుర్వినియోగానికి సంబంధించి ఉన్నికృష్ణన్ కు పాత్ర ఉందని తేలడంతో కేసును సిట్ కు అప్పగిస్తూ కోర్టు నిర్ణయించింది. సిట్ బృందంలో మాజీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్. శశిధరన్ , క్రైమ్ బ్రాంచ్ చీఫ్ అదనపు డైరెక్టర్ హెచ్. వెంకటేష్ తో పాటు సైబర్ నిపుణులు, పలువురు ఇన్ స్పెక్టర్లు ఉంటారు.

Bihar Elections 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీనే.. ఎడ్జ్ ఎవరికంటే ?

Exit mobile version