Prabhas:తమిళనాడులో ప్రభాస్ సెన్సేషన్.. విజయ్ వెనకడుగు డార్లింగ్‌కు ప్లస్ అయిందా?

Prabhas: ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తర్వాత ది రాజాసాబ్ సినిమా ప్రభావం తమిళనాడులో ఊహించని విధంగా కనిపిస్తోంది.

Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ..ది రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమైంది. జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల తర్వాత ఈ సినిమా ప్రభావం తమిళనాడులో ఊహించని విధంగా కనిపిస్తోంది. సాధారణంగా సంక్రాంతి (పొంగల్) సమయంలో తమిళనాట అక్కడి లోకల్ స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది.

తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న జన నాయగన్..మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం ప్రభాస్(,Prabhas) సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. విజయ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా పడటం, అక్కడ పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేకపోవడంతో అందరి చూపు రాజాసాబ్‌పై పడింది.

ఈ సిచ్యువేషన్‌ను దీనిని గమనించిన తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు.. రాజాసాబ్ సినిమాకి భారీ స్థాయిలో థియేటర్లను కేటాయిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఒక తెలుగు హీరో సినిమాకు తమిళనాడులో ఈ స్థాయిలో స్క్రీన్లు లభించడం ‘బాహుబలి 2’ తర్వాత ఇదే అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

దర్శకుడు మారుతి ఈ మూవీని కేవలం తెలుగు ఆడయన్స్ కోసం మాత్రమే కాకుండా, అన్ని భాషలు అన్ని ప్రాంతాల వారికి నచ్చేలా హారర్-కామెడీ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కించారు. తమిళ ప్రేక్షకులకు హారర్ కామెడీలు అంటే చాలా ఇష్టంగా చూస్తారు. గతంలో వచ్చిన ‘కాంచన’, ‘చంద్రముఖి’ వంటి సినిమాలు అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యాయి.

The Rajasaab

ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్(,Prabhas) వింటేజ్ లుక్ తో, గ్రాండ్ విజువల్స్ తో వస్తుండటంతో తమిళ తంబీలు కూడా ఈ సినిమా కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. గంటల వ్యవధిలోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సంక్రాంతి బరిలో పోటీ లేకపోవడం, ప్రభాస్ క్రేజ్ తోడవ్వడంతో రాజాసాబ్ తమిళనాట కూడా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version