Valentine Day : వాలెంటైన్స్ డేను చాలామంది ఎందుకు వ్యతిరేకిస్తారు?

Valentine Day : ఫిబ్రవరి 14ను బ్లాక్ డేగా పాటిస్తూ, అమర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటారు.

Valentine Day

భారతదేశంలో ఫిబ్రవరి 14 వస్తుందంటే.. వాలెంటైన్స్ డే (Valentine Day) చుట్టూ ఎప్పుడూ పెద్ద చర్చే నడుస్తూ ఉంటుంది. మన దేశంలో ఒక వర్గం ప్రజలు ఈ వేడుకను మన సంస్కృతికి విరుద్ధమని భావించడమే కాకుండా, ఈ రోజును ఒక ‘బ్లాక్ డే’గా భావిస్తారు.

భారతదేశం సంప్రదాయాలతో పాటు కుటుంబ విలువలకు పెద్దపీట వేసే దేశం అని తెలిసిందే . ఇక్కడ ప్రేమ అనేది వ్యక్తిగతమైనది . గౌరవప్రదమైనదిగా చూస్తారు. బహిరంగంగా ప్రేమను ప్రదర్శించడం కానీ, పాశ్చాత్య దేశాల వలె రోడ్లపై వేడుకలు చేసుకోవడం భారతీయుల లైఫ్ స్టైల్‌కు భిన్నంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు.

అందుకే వాలెంటైన్స్ డే( (Valentine Day) చాలా మంది దీనిని ఫారెన్ కల్చర్ అని దీనికి దూరంగా ఉంటారు. భజరంగ్‌దళ్ సభ్యులు అయితే ఆరోజు ప్రేమికులు ఎవరైనా కనిపిస్తే బలవంతంగా పెళ్లి జరిపించిన సంఘటనలు కూడా చాలానే జరుగుతాయి.

అంతేకాకుండా భారతీయులు ఈ రోజును వ్యతిరేకించడానికి అన్నిటికంటే అతి బలమైన కారణం 2019, ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడి జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో ఏకంగా 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు.

Valentine’s Day

యావత్ దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిన ఆ రోజును భారతీయులు మర్చిపోలేరు. అందుకే చాలా మంది ఈ రోజున వేడుకలు చేసుకోవడం కంటే, మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన ఆ అమరవీరులకు నివాళులు అర్పించాలని చెబుతారు. ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటిస్తూ, అమర జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటారు.

మరో ముఖ్యమైన కారణం ఏంటంటే.. వాలెంటైన్స్ డే ((Valentine Day) రోజు బహుమతులు, గ్రీటింగ్ కార్డులు, రెస్టారెంట్ల పేరుతో కార్పొరేట్ సంస్థలు కోట్లాది రూపాయల వ్యాపారాన్ని చేస్తాయి. ఇది కేవలం షో-ఆఫ్ కోసం చేస్తున్న వేడుక అని, నిజమైన ప్రేమకు ఇటువంటి స్పెషల్ డే అవసరం లేదని విమర్శకులు వాదిస్తారు. కేవలం మార్కెటింగ్ మాయాజాలంలో పడి మన విలువలను మనమే మరిచిపోతున్నామని అంటారు

Valentine’s Day

అలాగే మరికొందరు ఇదే రోజు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు మరణశిక్ష పడిందని కూడా అంటారు. కానీ నిజానికి అది మార్చి 23న తేదీన జరిగిందని చరిత్ర చెబుతుంది. ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడం కంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను గౌరవించడమే గొప్పని భావించే వారి సంఖ్య దేశంలో చాలా ఎక్కువ.

T20 World Cup : వార్మప్ అదిరింది..సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం

Exit mobile version