Supreme Court E20
ఇంధన విధానంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయడంపై ..భారత సుప్రీంకోర్టు(Supreme Court E20) సెప్టెంబర్ 1న ఒక కీలకమైన తీర్పును వెలువరించడంతో రెండు రోజులుగా దీనిపై చర్చ నడుస్తోంది. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిగిన ఈ E20 ఇంధనాన్ని దశలవారీగా ప్రవేశపెట్టడాన్ని నిలిపివేయాలని అడ్వకేట్ అక్షయ్ మాల్హోత్రా కోరారు.
పాత వాహనాలు ఈ ఇంధనంతో సరిగ్గా పని చేయవని, అది ఇంజిన్‌కు నష్టం కలిగించవచ్చని ఆయన వాదించారు. అలాగే, వినియోగదారుల కోసం పెట్రోల్ పంప్‌ల వద్ద ఇథనాల్ లేని సాధారణ పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని, ఇంధనంలో ఉన్న ఇథనాల్ శాతాన్ని పంప్‌ల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని ఆయన అభ్యర్థించారు.
అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి ,న్యాయమూర్తి కే. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానం భారతదేశ చక్కెర రైతులకు ఎంతో మేలు చేస్తుందని, విదేశీ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని కోర్టుకు వివరించింది.
ఈ నిర్ణయం వల్ల దేశం పెట్రోల్, డీజిల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, అలాగే చక్కెర రైతులకు మార్కెట్ విస్తరణలో ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా, పదేళ్లలో కాలుష్యాన్ని తగ్గించడంలో ఇది ఒక ముఖ్యమైన పర్యావరణ పరిరక్షణ చర్యగా కూడా ఉంటుందని అభిప్రాయపడింది.
కోర్టు తన తీర్పులో(Supreme Court E20), E20 పెట్రోల్ 2025 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2023 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలు ఈ ఇంధనానికి అనుకూలంగా ఉంటాయని, అయితే పాత వాహనాల యజమానులు తమ వాహనం ఇంధనానికి సరిపోతుందో లేదో తెలుసుకుని వాడాలని సూచించింది.
పంప్‌ల వద్ద ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ప్రదర్శించాలని చెప్పినా కూడా, ఇథనాల్ లేని పెట్రోల్‌ను తప్పనిసరిగా అందించాల్సిన అవసరం లేదని తీర్పులో తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిపై కేంద్రం ..విదేశీ లాబీ ఉన్న వ్యక్తి అని అభిప్రాయపడటం కూడా కోర్టు గమనించింది. ఈ తీర్పు ఆర్థిక, పర్యావరణ విధానాల పరంగా కీలకమైనదిగా మారింది. అయితే, పాత వాహనాల యజమానులు ఇంజిన్ సామర్థ్యం తగ్గడం, నష్టం వంటి ప్రమాదాలకు సిద్ధంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Kavitha: కూతురిపై సస్పెన్సన్ వేటు వేసిన గులాబీ బాస్..