Swami Chaitanyananda Saraswati: ఆశ్రమంలో ఐటెం రాజా ఢిల్లీలో ఓ బాబా అరాచకం

విచ్చలవిడిగా అక్కడి విద్యార్థినులను వేధిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తు ద్వారా వెల్లడైంది. ఒడిశాకు చెందిన ఈ స్వామిజీ(Swami Chaitanyananda Saraswati) అసలు పేరు పార్థసారథిగా గుర్తించారు.

Swami Chaitanyananda Saraswati

శ్రీ శారదా పీఠం ఢిల్లీ ఆశ్రమంలో ఓ స్వామిజీ లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. మఠం డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి (Swami Chaitanyananda Saraswati)తమను లైంగికంగా వేధించాడంటూ ఏకంగా 17 మంది విద్యార్థినులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదైంది. స్కాలర్ షిప్స్ తో చదువుకుంటూ ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థినులను అతను టార్గెట్ చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గతంలో రెండు కేసులు నమోదైనప్పటకీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోయాడు. విద్యార్థినులకు వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజులు పంపిస్తూ బ్లాక్ మెయిలింగ్ కు కూడా పాల్పడ్డాడని తెలిసింది.

విద్యార్థినుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతుంటే సంచలన విషయాలు వెల్లడయ్యాయి. విద్యార్థినుల నెంబర్లు తీసుకుని దారుణమైన మెసేజ్ లు పెడుతూ వేధింపులకు పాల్పడినట్టు గుర్తించారు. తనతో గడిపితే ఫారిన్ ట్రిప్‌కి తీసుకెళ్తానంటూ ఆఫర్ చేశాడని ఓ యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Swami Chaitanyananda Saraswati

శారదా పీఠానికి సంబంధించి 50 మంది మహిళల మొబైల్ ఫోన్లలో వాట్సాప్ డేటాను పోలీసులు లోతుగా పరిశీలించగా.. ఈ స్వామిజీ(Swami Chaitanyananda Saraswati) ఆకృత్యాలు మరిన్ని బయటపడ్డాయి. చాలా ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్న స్వామీ చైతన్యానంద పదుల సంఖ్యలో మహిళలను ఇలాగే వేధించాడని తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఆశజూపడం, మరికొందరు విద్యార్థినులకు మార్కులు తక్కువ వేసి ఫెయిల్ చేస్తానంటూ బెదిరించిన ఉదంతాలను వాట్సాప్ మెసేజ్ ల్లో గుర్తించారు. గతంలో 2009లో ఒకసారి, 2016లో మరోసారి ఇటువంటి తరహా కేసులు నమోదవగా.. వాటి నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.

ఈ కారణంగానే తర్వాతి కాలంలో అతను విచ్చలవిడిగా అక్కడి విద్యార్థినులను వేధిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తు ద్వారా వెల్లడైంది. ఒడిశాకు చెందిన ఈ స్వామిజీ(Swami Chaitanyananda Saraswati) అసలు పేరు పార్థసారథిగా గుర్తించారు. చాలా ఏళ్ళుగా ఆశ్రమంలో ఉంటూ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. అయితే లైంగిక వేధింపుల కేసులో మరోసారి ఆరోపణలు రావడంతో డైరెక్టర్ పదవి నుంచి అతడిని తొలగించినట్టు ఆశ్రమం వర్గాలు తెలిపాయి.

గత కొంతకాలంగా అతని వేధింపులు ఎక్కువవడంతో విద్యార్థినులందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు వ్యవహారం బయటకు రాకముందే పార్థసారథి పరారయ్యాడు. చివరిసారిగా అతని లొకేషన్ ఆగ్రా సమీపంలో గుర్తించిన పోలీసులు పలు బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు. మరోవైపు ఆశ్రమంలో పార్థసారథి గదితో పాటు మరికొన్ని చోట్ల పోలీసులు సోదాలు జరుపుతున్నారు. అలాగే అక్కడే ఉంటున్న మహిళలు, ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే పార్థసారథిగా అక్కడే వార్డెన్లుగా ఉంటున్న మహిళలు సహకరిస్తున్నట్టు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన శారదా పీఠంలో ఇలాంటి తరహా ఘటన జరగడం సంచలనంగా మారింది.

Kerala: కేరళలో దడపుట్టిస్తున్న కొత్త వ్యాధి బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో పలువురు మృతి

Exit mobile version