Tatkal tickets: ఈరోజు నుంచి కొత్త రూల్స్..ఇలా చేస్తేనే తత్కాల్ టికెట్లు బుకింగ్ అవుతాయి

Tatkal tickets: టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకులు తప్పనిసరిగా తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

Tatkal tickets

రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. డిసెంబర్ 1వ తేదీ నుంచి తత్కాల్ టికెట్(Tatkal tickets) బుకింగ్ నిబంధనలలో భారతీయ రైల్వేలు కొన్ని కీలక మార్పులను తీసుకువస్తున్నాయి. ఈ కొత్త రూల్స్‌ను కచ్చితంగా పాటించకపోతే మీరు తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోలేరు.

భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌలభ్యం, భద్రత, పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను (Tatkal Ticket Booking) అమల్లోకి తెస్తున్నాయి. పశ్చిమ రైల్వే బోర్డు ప్రకటించిన మార్పుల ప్రకారం, తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఇకపై ఓటీపీ (OTP) వెరిఫికేషన్ తప్పనిసరి.

OTP వెరిఫికేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే.. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణీకుల మొబైల్ నంబర్‌కు సిస్టమ్-జనరేటెడ్ వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) పంపబడుతుంది.

టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణీకులు తప్పనిసరిగా తమ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత, సిస్టమ్ ఒక OTPని జనరేట్ చేసి, ఆ మొబైల్ నంబర్‌కు పంపుతుంది.ఈ OTPని ఎంటర్ చేసి, వెరిఫై చేసిన తర్వాతే తత్కాల్ టిక్కెట్లు(Tatkal tickets) కన్ఫార్మ్ అవుతాయి.

ముఖ్య గమనిక: మీరు నమోదు చేసిన OTP తప్పుగా ఉన్నా లేదా సరైన ధృవీకరణ జరగకపోయినా, టికెట్ జారీ కాదు.

Tatkal tickets

ఈ కొత్త రూల్స్ వేటికి వర్తిస్తాయన్న అనుమానం చాలామందిలో ఉంది. అయితే ఈ OTP ఆధారిత వెరిఫికేషన్ సిస్టమ్ అన్ని రకాల తత్కాల్ బుకింగ్‌లకు వర్తిస్తుంది. అంటే కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు, IRCTC వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ , మొబైల్ యాప్‌ల ద్వారా చేసిన రైల్వే బుకింగ్స్ కు పనిచేస్తాయి.

గతంలో తత్కాల్ టికెట్ బుకింగ్‌లలో మోసాలు, అక్రమ పద్ధతులు (Bots ఉపయోగించడం వంటివి) జరిగాయి. దీని వల్ల నిజమైన ప్రయాణీకులకు టికెట్లు దొరకక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యలను తగ్గించడానికి , టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చడానికి రైల్వే బోర్డు ఈ OTP ఆధారిత వెరిఫికేషన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది.

వెరిఫైడ్ వివరాలు కలిగిన ప్రయాణీకులకు మాత్రమే తత్కాల్ టిక్కెట్లు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త సిస్టమ్ ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్‌లలోని సమస్యలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version