Aqueel Khan: ఆకతాయి కాదు క్రిమినల్.. ఇండోర్ నిందితుడికి పోలీస్ ట్రీట్ మెంట్

మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించి దేశం పరువు తీసిన నిందితుడు అకీల్ ఖాన్( Aqueel Khan) కు ఇంటరాగేషన్ లో పోలీసులు తమదైన ట్రీట్ మెంట్ ఇచ్చారు.

Aqueel Khan

ప్రపంచకప్ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడి గురించి సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఇండోర్ లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాదు దేశం పరువు తీసింది. ఆసీస్ మహిళా క్రికెటర్లపై వేధింపులకు పాల్పడిన నిందితుడు అకీల్ ఖాన్ ను మొదట ఆకతాయిగా భావించారు.

కానీ అరెస్ట్ చేసిన తర్వాత వాడి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ అంతా బయటపడింది. అకీల్ ఖాన్ అలియాస్ నైట్రాగా పేరున్న నిందితుడు ఇండోర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమనల్ గా పోలీసులు గుర్తించారు. దాదాపు 13 ఏళ్ళ క్రితమే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు తెలిసింది. పదికి పైగా కేసులో గతంలోనే అరెస్టయ్యాడు. బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.

మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు ఇండోర్ లో బస చేసింది. రాడిసన్ హోటల్ నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు దగ్గరలో ఉన్న కేఫ్ కు వెళ్ళారు. తిరిగి వస్తుండగా.. నిందితుడు అకీల్ ఖాన్ బైక్ పై వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఒక క్రికెటర్ చేయి పట్టుకుని లాగాడు. తర్వాత వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మరో క్రికెటర్ తో అసభ్యకరంగా బిహేవ్ చేశాడు.

Aqueel Khan

దీంతో షాక్ కు గురైన ఇద్దరు మహిళా క్రికెటర్లు తమ మేనేజర్ కు చెప్పగా… పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే స్పందించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గంటలోపే అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అకీల్ ఖాన్ నేరచరిత్ర అంతా బయటపడింది. 2012కు ముందు పలు దోపిడీ కేసుల్లోనూ, హత్యాయత్నం, బెదిరింపులు, డ్రగ్స్ సరఫరా, వంటి కేసుల్లోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు గుర్తించారు.

నిందితుడు అకీల్ ఖాన్( Aqueel Khan) ప్రస్తుతం పెయింటర్ గా పనిచేస్తున్నట్టు ఇండోర్ క్రైమ్ బ్రాండ్ ఏసీపీ వెల్లడించారు. ఒక కేసులో ఇటీవల జైలు శిక్ష పూర్తిచేసుకుని విడుదలైనట్టు తెలిపారు. అతని తల్లిదండ్రులు కూలి పని చేస్తుంటారని వెల్లడించారు.

ఇదిలా ఉంటే మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించి దేశం పరువు తీసిన నిందితుడు అకీల్ ఖాన్( Aqueel Khan) కు ఇంటరాగేషన్ లో పోలీసులు తమదైన ట్రీట్ మెంట్ ఇచ్చారు. అతని అరెస్టును చూపుతూ పోలీసులు విడుదల చేసిన వీడియోలో అకీల్ ఖాన్ కుంటుతూ నడుస్తున్నాడు. కాలికి , చేతికి పెద్ద కట్లు కూడా ఉన్నాయి. దీంతో ఇంకోసారి ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా గట్టి ట్రీట్ మెంట్ ఇచ్చారంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

Ram Charan :ఎన్టీఆర్ కాదు.. లైన్లోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. డైరెక్టర్ నెల్సన్ కుమార్ మాస్టర్ ప్లాన్ ఇదే

Exit mobile version