Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్ హక్కులు మనవే

Commonwealth Games: 2030తో కామన్వెల్త్ గేమ్స్ కు వండేళ్లు పూర్తవుతున్నాయి. అలాంటి అరుదైన మైలురాయి సమయంలో ఆతిథ్యమిచ్చే అవకాశం రావడంపైనా భారత క్రీడావర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Commonwealth Games

ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడాసంబరం కామన్ వెల్త్ గేమ్స్ (Commonwealth Games).. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం ఉండే పోటీనే వేరు..తీవ్రమైన పోటీ ఉండే కామన్ వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుంది. 2030 కామన్ వెల్త్ గేమ్స్ కు అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనుంది. గత నెలలోనే ఇది ఖరారైనప్పటకీ తాజాగా కామన్ వెల్త్ గేమ్స్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో దీనిని ధృవీకరించారు. గ్లాస్గోలో జరిగిన సమావేశంలో ఐవోఏ చీఫ్ పిటి ఉష ఆతిథ్య హక్కులకు సంబంధించిన ధృవీకరణ పత్రం కూడా అందుకున్నారు.

గతంలో 2010లో న్యూఢిల్లీ వేదికగా కామన్ వెల్త్ గేమ్స్ (Commonwealth Games)జరిగాయి. 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం కోసం భారత్ ఉవ్విళ్ళూరుతున్న సమయంలో కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు రావడం కీలక పరిణామంగా చెబుతున్నారు. బిడ్డింగ్ లో అహ్మదాబాద్ కు నైజీరియా నగరం అబుజా నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే వార్షిక సమావేశంలో 74 దేశాల ప్రతినిధులు అహ్మదాబాద్ కు ఓటేశారు. దీంతో అహ్మదాబాద్ కు ఆతిథ్య హక్కులు కేటాయిస్తున్నట్టు సీడబ్ల్యూజీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రకటించింది.

కాగా 2030తో కామన్వెల్త్ గేమ్స్ కు వండేళ్లు పూర్తవుతున్నాయి. అలాంటి అరుదైన మైలురాయి సమయంలో ఆతిథ్యమిచ్చే అవకాశం రావడంపైనా భారత క్రీడావర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు భారత్ కు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Commonwealth Games (1)

ఈ సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన మోదీ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ దేశానికి గర్వకారణమన్నారు. క్రీడల పట్ల మన దేశానికి ఉన్న నిబద్ధతతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఈ క్రీడాసంబరంతో గ్లోబల్ మ్యాప్ లో భారత్ సత్తా మరోసారి చాటిచెప్పబోతున్నామని తెలిపారు.

వందేళ్లు పూర్తి చేసుకుంటున్న కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)ను అత్యద్భుతంగా నిర్వహించేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నామని మోదీ ట్వీట్ చేశారు. దేశప్రజలంతా ఈ చారిత్రక సంబరంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇక భారత్, ప్రపంచ క్రీడాకేంద్రంగా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పానికి ఇది నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ పా చెప్పారు.

దశాబ్ద కాలంగా దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక నడుపాయాలను మోదీ అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.. మరోవైపు 2023 కామన్వెల్త్ గేమ్స్ 15 నుంచి 17 క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయని కామన్వెల్త్ స్పోర్ట్ తెలిపింది. వీటిలో అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, నెట్ బాల్ వంటి పలు క్రీడలు ఇప్పటికే ఖారారయ్యాయి. ఆర్చరీ, బ్యాడ్మింటన్, జూడో, హాకీ , బాక్సింగ్, రగ్బీ, స్క్వాష్ , బీచ్ వాలీబాల్ , క్రికెట్ , సైక్లింగ్, వాలీబాల్ వంటి క్రీడలను పరిశీలిస్తున్నారు. వీటి ఎంపిక ప్రక్రియ వచ్చే నెల నుంచి మొదలుకానుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version