Post office
టెక్నాలజీ యుగంలో ఫోన్‌లు, ఈమెయిల్‌లు, మెసేజ్‌ల మధ్య మనం ఉత్తరాలను దాదాపుగా మర్చిపోయాం. కానీ, మన దేశంలో ఇంకా ఉత్తరాలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పోస్టాఫీస్ గురించి మీకు తెలుసా? ఆ పోస్టాఫీస్ ఎక్కడ ఉంది, దాని విశేషాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోస్టాఫీస్ మన భారతదేశంలోనే, హిమాచల్ ప్రదేశ్‌లోని హిక్కిం గ్రామంలో ఉంది. 1983లో ప్రారంభించిన ఈ పోస్టాఫీస్ సముద్ర మట్టానికి 4,400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ఎముకలు కొరికే చలిలో, ప్రమాదకరమైన దారుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
ఈ పోస్టాఫీస్(Post office) చుట్టుపక్కల ఐదు గ్రామాల ప్రజలకు ఒక ముఖ్యమైన కేంద్రం. ఈ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ సౌకర్యాలు చాలా తక్కువగా ఉండటం వల్ల, గ్రామస్థులు ఉత్తరాలు పంపించుకోవడానికి , బ్యాంకు లావాదేవీల కోసం ఈ పోస్టాఫీస్‌పైనే ఆధారపడతారు.
ఈ పోస్టాఫీస్(Post office) పర్యాటకులకు కూడా ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే టూరిస్టులు ఇక్కడి నుంచి తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఉత్తరాలు పంపించి ఆనందిస్తారు.
ఈ పోస్టాఫీస్‌లో ఇద్దరు పోస్టుమెన్‌లు పని చేస్తారు. ప్రతిరోజూ సాయంత్రం వారు ఉత్తరాలను దగ్గరలో ఉన్న కాజా పట్టణానికి తీసుకెళ్తారు. మంచు ఎక్కువగా పడినప్పుడు ఈ పోస్టాఫీస్‌ను మూసివేస్తారు. హిక్కిం పోస్టాఫీస్ చరిత్ర, ప్రకృతి , మనుషుల మధ్య ఒక అద్భుతమైన బంధాన్ని తెలియజేస్తుంది.