RRB: ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు రాత పరీక్ష తేదీలు వచ్చేశాయ్!

RRB: పరీక్షలు ఎప్పుడు?: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన ప్రకారం, ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 10 నుంచి 12 వరకు జరగనున్నాయి.

RRB

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. వివిధ రైల్వే రీజియన్లలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీస్‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్‌ రాత పరీక్షల తేదీలను విడుదల చేసింది.

 పరీక్షలు ఎప్పుడు?: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన ప్రకారం, ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 10 నుంచి 12 వరకు జరగనున్నాయి.

పరీక్ష విధానం: ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఎన్ని పోస్టులు?: ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,036 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటి(RRB)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, సైంటిఫిక్ సూపర్‌వైజర్లు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్లు, చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, లైబ్రేరియన్, ప్రైమరీ రైల్వే టీచర్, అసిస్టెంట్ టీచర్ వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల తుది ఎంపిక ఆన్‌లైన్‌ రాత పరీక్ష, టీచింగ్‌ స్కిల్ టెస్ట్‌, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌ వంటి దశల ఆధారంగా ఉంటుంది.

RRB

ముఖ్యమైన తేదీలు: పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రం (city intimation slip) వివరాలు త్వరలో విడుదల అవుతాయి. అడ్మిట్‌ కార్డులు మాత్రం పరీక్షకు నాలుగు రోజుల ముందు అందుబాటులోకి వస్తాయి. అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు.

 

Exit mobile version