Just TelanganaLatest News

RTC Jobs:ఆర్టీసీ జాబ్స్: అర్హతలు, వయస్సు, ఎంపిక ప్రక్రియ పూర్తి డిటైల్స్ ఇవే!

RTC Jobs:తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

RTC Jobs

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక శుభవార్త వినిపించింది రేవంత్ సర్కార్. సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 3,038 పోస్టులను త్వరలో వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు రెగ్యులర్ విధానంలో, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జరగనున్నాయి.

పోస్టుల వివరాలు, అర్హతలు:

  • మొత్తం 3,038 పోస్టులను పలు విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అందులో ముఖ్యమైనవి:
  • డ్రైవర్లు (2,000 పోస్టులు): ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో పాటు హెవీ వెహికిల్ లైసెన్స్, అనుభవం అవసరం.
  • శ్రామిక్ (743 పోస్టులు): ఈ పోస్టులకు 10వ తరగతి లేదా ఐటీఐ అర్హత సరిపోతుంది.
  • అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ సూపరింటెండెంట్ వంటివి: ఈ పోస్టులకు డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ అర్హతలు అవసరం.
  • మెడికల్ ఆఫీసర్ (జనరల్ & స్పెషలిస్ట్): మొత్తం 14 పోస్టులు ఉన్నాయి, వీటికి మెడికల్ డిగ్రీ అవసరం.

వివిధ రిక్రూట్‌మెంట్ బోర్డుల ద్వారా ఎంపిక:

ఈ ఉద్యోగాల భర్తీకి TGSRTC విభిన్న రిక్రూట్‌మెంట్ బోర్డుల సహకారం తీసుకోనుంది.

  • పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు: డ్రైవర్లు, శ్రామిక్, డిప్యూటీ సూపరింటెండెంట్ వంటి పోస్టుల ఎంపికను ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది.
  • టీజీపీఎస్సీ (TGPSC): డిపో మేనేజర్, అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ వంటి గెజిటెడ్ పోస్టులను TGPSC ద్వారా భర్తీ చేయనున్నారు.
  • మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు: మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఈ బోర్డు ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
RTC Jobs
RTC Jobs

18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఈ (RTC Jobs)ఉద్యోగాలకు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ (RTC Jobs) ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్లను (10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, కుల, నివాస ధృవీకరణ పత్రాలు) సిద్ధం చేసుకోవడం మంచిది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button