Varinder Singh: టైగర్ 3 విలన్, బాడీబిల్డర్ వరీందర్ సింగ్ ఘుమన్ ఆకస్మిక మృతి

Varinder Singh: సల్మాన్ ఖాన్ హీరోగా 2023లో విడుదలైన భారీ చిత్రం 'టైగర్ 3'లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వరీందర్ సింగ్, అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

Varinder Singh

బాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బాడీబిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమన్(Varinder Singh) (42) గుండెపోటు వల్ల హఠాన్మరణం చెందారు. కేవలం 42 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన కన్నుమూయడం సినీ , క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

సల్మాన్ ఖాన్ హీరోగా 2023లో విడుదలైన భారీ చిత్రం ‘టైగర్ 3’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వరీందర్ సింగ్, అక్టోబర్ 10వ తేదీ సాయంత్రం 5:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ విషాద వార్తను పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎంపీ సుఖీందర్ సింగ్ రంధావా గురువారం సాయంత్రం తమ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. సుఖీందర్ సింగ్ తన సంతాప సందేశంలో, “పంజాబ్‌కు చెందిన ప్రఖ్యాత బాడీబిల్డర్ , నటుడు వరీందర్ సింగ్ ఘుమన్ అకాల మరణం వార్త విని నా హృదయం ఎంతో బాధపడింది. తన కృషితో పాటు క్రమశిక్షణతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పంజాబ్ కీర్తిని చాటారు,” అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని భరించే శక్తి లభించాలని ప్రార్థించారు.

Varinder Singh

భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పర్జత్ సింగ్ కూడా స్పందిస్తూ, “క్రమశిక్షణతో శరీరాన్ని నిర్మించుకున్న శాకాహారి (Vegetarian) అయిన వరీందర్(Varinder Singh) మరణం బాధాకరం,” అంటూ నివాళులు అర్పించారు.

వరీందర్ సింగ్ ఘుమన్(Varinder Singh) బాడీబిల్డింగ్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.ఆయన 2009లో ‘మిస్టర్ ఇండియా’ టైటిల్‌ను గెలుచుకున్నారు.
అంతేకాక, ‘మిస్టర్ ఆసియా’ పోటీల్లో రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటారు. బాడీబిల్డింగ్‌తో పాటు, ఆయన నటుడిగానూ రాణించారు. 2012లో ‘కబడ్డీ వన్స్ మోర్’ అనే పంజాబీ చిత్రంతో సినీరంగంలో అరంగేట్రం చేశారు.

ఆ తర్వాత ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్’ (2014) , సిద్ధార్థ్ మల్హోత్రా, రితీష్ దేశ్‌ముఖ్ నటించిన ‘మర్జావాన్’ (2019) వంటి బాలీవుడ్ చిత్రాలలోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు.చివరిగా, సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’లో విలన్‌గా నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
శారీరకంగా అత్యంత దృఢంగా, ఆరోగ్యంగా కనిపించే వరీందర్ సింగ్ గుండెపోటుతో మరణించడం, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ తీసుకునే ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేస్తోంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version