Cleanliness: చెత్త నగరాలను తయారు చేయడంలో మన పాత్ర ఎంత? జస్ట్ ఆస్కింగ్..

Cleanliness: మనకు తెలీకుండానే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం మన సంస్కృతి అన్న ఫీలింగ్‌ను మన జనరేషన్‌కు అలవాటు చేసేస్తున్నాము.

Cleanliness

నేను వేసిన చెత్తను నేనే చెత్తబుట్టలో వేస్తాననే ఒక చిన్న అలవాటు.. దేశ భవిష్యత్తును మారుస్తుంది. మన బాధ్యతను మనం నిర్వర్తించినపుడే నిజమైన మార్పు మొదలవుతుంది. ఇది మనల్ని మనం కించపరుచుకోవడం కాదు.. మనల్ని మనం గొప్పగా చాటుకోవడం.ఎందుకంటే మార్పు మనతోనే మొదలవ్వాలి. అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్‌కు నిజమైన ఉదాహరణలుగా మన రాష్ట్రాన్ని నిలపడంలో మనమూ భాగస్వాములం అవుతాం.

అలవాటు చిన్నదే కానీ ఆచరణ పెద్దది. ఎందుకంటే మనం రోడ్డుపై పడేస్తున్న చెత్త కేవలం ఒక వేస్ట్ కాదు. అది మన బాధ్యతను, మన సమాజాన్ని, చివరికి మనల్ని మనమే కించపరుచుకుంటున్నామని అర్ధం. రోడ్లను శుభ్రం చేయడం ప్రభుత్వం లేదా పారిశుద్ధ్య కార్మికుల పని అనే ఆలోచన మనలో లోతుగా పాతుకుపోయింది. కానీ, మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలని కోరుకునే మనం, ఇంటి బయట ఉన్న రోడ్డును కూడా మన ఆవరణగానే ఎందుకు భావించం? ఈ మానసిక మార్పు రానంత వరకు, నిజమైన అభివృద్ధి కేవలం ఒక కలగానే మిగిలిపోతుంది.

రోడ్లపై చెత్త పడేయడం(Cleanliness) కేవలం అశుభ్రతే కాదు.. అనారోగ్యానికి కూడా మూలకారణం. ప్లాస్టిక్ వ్యర్థాలు, మలినాలు పేరుకుపోయి వ్యాధులకు నిలయాలుగా మారతాయి.అలాగే, మనకు తెలీకుండానే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం మన సంస్కృతి(Civic responsibility India) అన్న ఫీలింగ్‌ను మన జనరేషన్‌కు అలవాటు చేసేస్తున్నాము.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అభివృద్ధి చెందిన దేశాలైన సింగపూర్, జపాన్, యూఎస్ వంటి వాటిలో ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే భారీ జరిమానాలు విధిస్తారు. ఉమ్మివేసినా, సిగరెట్ పీకలు పడేసినా కఠినమైన శిక్షలు ఉంటాయి. అక్కడి ప్రజలు తమ చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా ఉంచుకోవడమే తమ వ్యక్తిగత బాధ్యతగా భావిస్తారు. అక్కడ ప్రభుత్వాలు కూడా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో ముందుంటాయి. ప్రతిచోటా చెత్తబుట్టలు, రీసైక్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు సదుపాయాలను కల్పిస్తారు.

Cleanliness

మరి మన దేశంలో ఈ మార్పు ఎందుకు సాధ్యం కావడం లేదంటే.. ఈ సమస్యకు ప్రజల వైఖరితో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఒక ప్రధాన కారణమే. ఇది నా పని కాదని తరతరాలుగా పాతుకుపోయిన జనాల ఆలోచనా(Indian mindset ) విధానం, అలాగే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించినా, పబ్లిక్ ప్రదేశాల్లో అదే శ్రద్ధ చూపకపోవడం అనే మనుషుల స్వార్ధం..ట్యాక్సులు కడుతున్నాం కదా ఇది ప్రభుత్వం చేయాలనే సంకుచిత స్వభావం కూడా కారణాలు.

రోడ్డుపై చెత్త వేయడం(Cleanliness), ఉమ్మివేయడంపై చట్టాలు ఉన్నా కూడా వాటిని పటిష్టంగా అమలు చేయకపోవడంలో ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది. అలాగే, బస్ స్టాప్‌లు, రద్దీ ప్రదేశాల్లో చెత్తబుట్టల సంఖ్య చాలా తక్కువగా ఉండటం, చెత్తను క్రమం తప్పకుండా సేకరించకపోవడం వంటి మున్సిపల్ సేవల్లో లోపాలు కూడా ప్రజలకు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి.

నిజమైన మార్పు అందరి నుంచీ మొదలవ్వాలి. ప్రభుత్వం కూడా ప్రజల్లో ఈ బాధ్యతను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కఠినమైన జరిమానాలు విధించి, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలి. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత ప్రాముఖ్యతపై బోధించాలి. ఇవన్నీ మనం నిజంగా పాటిస్తేనే మన దేశం ప్రపంచానికి ఉన్న చిన్నచూపు పోయి అదే స్థానంలో అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

 

Exit mobile version