Bihar Assembly Election
బిహార్ (Bihar)లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ఎన్డీఏ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రతిపక్ష కూటమికి పోటీగా జంబో మేనిఫెస్టోను ప్రకటించింది. పేద, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా హామీలను గుప్పించింది. 69 పేజీల మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ విడుదల చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఐదేళ్ళలో యువతకు కోటికి పైగా ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటించింది. ఉద్యోగావకాశాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాది అవకాశాలుంటాయని పేర్కొంది.
ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా స్కిల్స్ సెన్సస్ ను నిర్వహించనున్నట్టు తెలిపింది. దీని కోసం ప్రతీ జిల్లాలో మెగా స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకిటించింది. గ్లోబల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కు అడ్రస్ గా బిహార్ (Bihar)ను మారుస్తామంటూ మేనిఫెస్టో హామీల్లో పేర్కొంది.వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం మరికొన్ని కీలక హామీలను కూడా ప్రకటించింది. ఈబీసీ వర్గాలకు చెందిన వృత్తి నిపుణులకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
అలాగే ఈబీసీల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైనా సిఫార్సులు చేసేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఛైర్మన్ గా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు హామీ ఇచ్చింది. ఈ హామీల్లో మహిళా ఓటర్లే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి వ్యవహరించింది. వ్యాపారాలు చేసుకునే మహిళలను మిలియనీర్లు చేయడమే లక్ష్యంగా కీలక హామీ ఇచ్చింది. కోటి మహిళలలను లకృతీ దీదీలుగా మారుస్తామని తెలిపింది. మహిళలకు స్వయం సమృద్ధి కల్పించే లక్ష్యంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన ద్వారా.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.
ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలను ఒకసారి చూస్తే. బిహార్ లో 7 ఎక్స్ ప్రెస్ వేస్ ను నిర్మించనున్నారు. పట్నాతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు నగరాల్లో మెట్రో ట్రైన్ సేవలను ప్రారంభించడం, కొత్త ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయడం… వీటి ద్వారా 50 లక్షల పెట్టుబడులను ఆకర్షించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. రైతులకు ఏటా3వేల సాయాన్ని అందించనున్నారు.
అలాగే కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం మరో ప్రధాన హామీగా ఇచ్చారు. వీటితో పాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉచిత రేషన్ , పేదలకు 50 లక్షలకుపైగా పక్కా ఇళ్ల నిర్మాణం రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం వంటి హామీలు కూడా ఉన్నాయి. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 6, 11 తేదీల్లోపోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
