Rahul Gandhi
ఒకవైపు బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి… మరోవైపు రాహుల్ గాంధీ (Rahul Gandhi)ఓట్ల చోరీపై మాట్లాడిన మాటలు దేశ రాజకీయాలను కంపించేలా చేస్తున్నాయి. చనిపోతున్న ఓటర్ల పేర్లు, రెండుసార్లు ఓటింగ్ లిస్టుల్లో ఉండే డూప్లికేట్ లెక్కలు, బోగస్ ఓట్లు అన్నీ కలిపి ఒక అణుబాంబే అన్నట్లు రాహుల్ మాట్లాడుతున్నారు.
ఓట్ల చోరీలో ఈసీ టాప్ టూ బాటమ్ ఇన్‌వాల్వ్ అయిందని రాహుల్ (Rahul Gandhi) తెగేసి చెప్పేశారు. పైగా తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని అవి బయట పెడితే.. ఈసీనే మిగలదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మహారాష్ట్ర (maharashtra), మధ్యప్రదేశ్ (madhyapradesh)లో కోటికి పైగా బోగస్ ఓట్లు జత చేశారని పెద్ద బాంబే వేసారు. ఆయన ఆరోపణలతో దేశ రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది.
కర్ణాటక (Karnataka) ఎన్నికల సమయంలోనే ఓట్లను తొలగించారని, ఓట్లను చోరీ చేసినట్టు తాము గుర్తించామన్న రాహుల్.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో కోటికిపైగా కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? ఎవరు చేర్చారు? ఎందుకు చేర్చారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏకంగా 6 నెలలుగా ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నామని రాహుల్ చెప్పుకొచ్చారు.
అయితే ఇవన్నీ సులభంగా తీసుకునే అంశం కాదు. ఎందుకంటే ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) .. దేశంలో నైతికతకు కర్తవ్యానికి ప్రతీకగా ఉండాల్సిన స్వతంత్ర సంస్థ. మరోవైపు గంభీర ఆరోపణలు చేస్తున్న వ్యక్తి చిన్నా చితకా మనిషి కాదు ..ప్రధాన ప్రతిపక్ష నేత.
అయితే ఈసీ మాత్రం రాహుల్ (Rahul Gandhi) చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని… ప్రతి రోజు ఈసీపై వేసే బుకాయింపు ఆరోపణలు చేస్తే తాము పట్టించుకోబోమని” ఘాటుగా పేర్కొంది. సరిగ్గా ఆధారాలేని ఆరోపణలు చేసినందుకు, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చన్న సంకేతాలు పంపింది.
మరోవైపు , బీహార్ (bihar) ఎన్నికలు (Bihar Elections) దగ్గరపడుతున్న వేళ… ఓట్ల తొలగింపు విషయం చర్చకు వచ్చింది. ఏకంగా 52 లక్షల ఓట్లను తొలగించినట్టు ఈసీ స్వయంగా ప్రకటించింది. అందులో 18 లక్షల మంది మరణించారని, 26 లక్షల మంది ప్రాంతం మార్చారని, 7 లక్షల ఓట్లు డూప్లికేట్‌గా ఉన్నాయని వివరించింది. కానీ.. ఇక్కడే నిజంగా అంత మంది పోయారా? లేదా మరో మాయా సంచికకు తెరలేపారా అన్న అనుమానాలను కాంగ్రెస్(congress) వ్యక్తం చేస్తోంది.
ఎన్నికల సంఘం టాప్ టూ బాటమ్ బురదలో మునిగిపోయింది… ఒక్కరు కాదు, ఆ వ్యవస్థ అంతా కాలుష్యం పాలైందని రాహుల్ ఆరోపిస్తున్నారు . అంటే ఆయన ఆరోపణల వెనుక నిజంగా ఏదైనా పెద్ద బాంబే ఉందా? లేదా.. రాహుల్ దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నట్లయితే… ఇప్పుడే ఎందుకు విడుదల చేయడం లేదన్న అనుమానాలు తలెత్తున్నాయి. ఇదంతా ఎన్నికల ముందు రాజకీయంగా మోదీ (modi) వర్సెస్ రాహుల్ దుమ్మురేపే మరో డ్రామా మాత్రమేనా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: Kaleshwaram :16నెలలు.. 650 పేజీలు.. కాళేశ్వరం కమిషన్ ఓపెన్ బుక్ రిలీజ్
Election : వన్ నేషన్.. వన్ ఎలక్షన్: ఎవరికి లాభం? ఎవరికి నష్టం?