Kavitha: తండ్రి ఫోటోకు రాంరాం.. కవిత్ వ్యూహం ఇదేనా ?

Kavitha: రాజీనామా చేసిన తరువాత కూడా కేసీఆర్ తనతో మాట్లాడలేదని కవిత ఓ ఇంటర్వ్యూలో తన బాధ చెప్పుకున్నారు. పార్టీ నుంచి బయటికి వచ్చిన తరువాత కవిత వార్తలు రాయకుండా మీడియాను కేటీఆర్, హరీష్‌ రావు హ్యాండిల్‌ చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

Kavitha

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చనేది అందరికీ తెలుసు… ఒకే కుటుంబంలో రాజకీయాలే చిచ్చు పెట్టిన ఉదాహరణలు కోకొల్లలు…పాలిటిక్స్ కారణంగానే భేదాబిప్రాయాలతో విడిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో కేసీఆర్ కుటుంబం కూడా చేరింది. బీఆర్ఎస్ తో విభేదించిన కవిత(Kavitha) ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు. మొన్నటి వరకూ కేసీఆరే నాకు రాజకీయ గురువు అంటూ మాటలు చెప్పిన ఆమె ఇప్పుడు తండ్రి ఫోటోను పక్కన పెట్టేసి సోలో ఇమేజ్‌తో జిల్లాల పర్యటనకు సిద్ధమైంది. ఇకపై పూర్తిగా సొంత ఎజెండాతో రాజకీయాల్లో ఎదగాలని నిర్ణయించుకున్నట్టు టాక్‌ నడుస్తోంది.

రాజీనామా చేసిన తరువాత కూడా కేసీఆర్ తనతో మాట్లాడలేదని కవిత(Kavitha) ఓ ఇంటర్వ్యూలో తన బాధ చెప్పుకున్నారు. పార్టీ నుంచి బయటికి వచ్చిన తరువాత కవిత వార్తలు రాయకుండా మీడియాను కేటీఆర్, హరీష్‌ రావు హ్యాండిల్‌ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సోషల్‌ మీడియాలో బీఆర్ఎస్‌ కార్యకర్తలు కవిత మీద విమర్శల వర్షం కురిపించారు. ఇంత జరిగినా కవిత విషయంలో కేసీఆర్‌ ఎక్కడా మాట్లాడలేదు. దీంతో ఇక తండ్రితో కూడా కవిత తెగదెంపులు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Kavitha

ఆ కారణంగానే తాజాగా జాగృతి జనం బాట యాత్ర పోస్టర్‌లో కేసీఆర్‌ ఫొటో వేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో టికెట్ కేటాయింపు విషయంలో పలుసార్లు కేసీఆర్ తో విభేదించిన కవిత సొంతంగా తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసారు. రాష్ట్రం మొత్తం తిరిగి తనకంటూ ఓ దళాన్ని సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్‌కు అనుసంధానంగా జాగృతిని నడిపి నిజామాబాద్‌ ఎంపీ టికెట్‌ సాధించారు. ఇప్పుడు కూడా అలానే తన దళం బలంతోనే పూర్తిగా సొంత రాజకీయాలు చేసేందుకు కవిత గ్రౌండ్ ప్రిపేర్‌ చేసుకున్నట్టు సమాచారం.

వాస్తవంగా చూస్తే ఇప్పుడు కవిత చేసేది పర్యటన మాత్రమే కాదు. తాను కొత్త పార్టీ పెడితే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో డైరెక్ట్‌గా తెలుసుకునే ప్రయోగమని పలువురు చెబుతున్నారు. అయితే కవిత కొత్త పార్టీ పెడితే మాత్రం బీఆర్ఎస్ కు ఎక్కువ నష్టం చేస్తుందని అంచనా. చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా.. ఏకంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టడం వెనుక కవిత(Kavitha)ది మాస్టర్ ప్లానేనని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Kavitha

ఇప్పటి వరకూ కేసీఆర్‌ కూతురిగా కవితను రిసీవ్‌ చేసుకున్న తెలంగాణ ప్రజలు.. ఇప్పుడు కేవలం జాగృతి కవితగా ఆమెను ఏ మేర ఆశీర్వదిస్తారనేది చూడాలి. ఇప్పటికిప్పుడే ఎన్నికలు లేనప్పటకీ క్షేత్రస్థాయిలో తన బలం తెలుసుకునేందుకు మాత్రం కవితకు ఈ జిల్లాల పర్యటన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కవితను లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఆమె పర్యటనకు వచ్చే రెస్పాన్స్ ను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

TTD:టీటీడీ పరకామణి దొంగతనం కేసులో సంచలనం..హైకోర్టు ఆగ్రహం,సీఐడీ దర్యాప్తుతో వీడుతున్న ముడులు

Exit mobile version