vijay: హీరో విజయ్ సభలో తొక్కిసలాట 33 మందికి పైగా మృతి

vijay: విజయ్ ప్రచారర్యాలీలో తొక్కిసలాట జరిగి 33 మందికి పైగా మృతి చెందారు.

vijay

తమిళనాడుతో విషాదం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్(vijay) ప్రచారర్యాలీలో తొక్కిసలాట జరిగి 33 మందికి పైగా మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవలే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన విజయ్ వరుసగా ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీకి జనం భారీగా తరలివచ్చారు. అనుకున్న సమయానికంటే విజయ్ ఆరు గంటల పాటు ఆలస్యంగా వచ్చినా ఓపిగ్గా వేచి ఉన్నారు. విజయ్ వచ్చీరాగానే అభివాదం చేసి ప్రసంగం ప్రారంభించారు. కాసేపటి తర్వాత పదేళ్ళ చిన్నారి తప్పిపోయినట్టు విజయ్ మైక్ లో ప్రకటించడంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ర్యాలీకి విజయ్ పార్టీ 10 వేల మందికే పర్మిషన్ తీసుకున్నట్టు సమాచారం. అయితే వారు ఊహించిన దాని కంటే ఎక్కువ మంది జనం తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది.

vijay

తొక్కిసలాట సమయంలో పరిస్థితి గమనించిన విజయ్(vijay) తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. అయినా కూడా తొక్కిసలాట జరిగి మహిళలు, చిన్నారులు సృహతప్పి పడిపోయారు. విజయ్ ప్రసంగించే సమయంలో ఆయనను దగ్గరగా చూడాలనే ఆతృత కూడా మరో కారణంగా భావిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన తర్వాత భారీ జనసందోహం మధ్యలోకి అంబులెన్సులు రావడం కూడా కష్టమైంది.

దీంతో విజయ్ అంబులెన్సులకు దారి ఇవ్వాలంటూ పదే పదే విజ్ఞప్తి చేశారు. చివరకు అతికష్టంమీద గాయపడిన వారిని అంబులెన్సుల్లో కరూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కొందరు హాస్పిటల్ కు తరలించే లోపే మృతి చెందగా.. చికిత్స అందిస్తున్న పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ విచారం వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.

అటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఘటనపై స్పందించి కలెక్టర్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనుకోని విధంగా దురదృష్టకరమైన ఘటన జరిగిందన్న ప్రధాని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. అయితే ర్యాలీలో సరైన భద్రతా ఏర్పాట్లు తీసుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక టీవీకే పార్టీ తరపున ర్యాలీకి అనుమతి తీసుకున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Desert: అటకామా డెసర్ట్ వండర్.. అత్యంత పొడి ఎడారిలో లక్షలాది పువ్వులు ఎలా వికసిస్తాయి?

Exit mobile version