Pradakshina: ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా?

Pradakshina: ప్రదక్షిణ అనే పదానికి కుడివైపు తిరగడం అని అర్థం వస్తుంది. దైవమూర్తి లేదా ఆలయం చుట్టూ కుడివైపు (సవ్యదిశలో) తిరగడాన్ని ప్రదక్షిణ అంటారు

Pradakshina

గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేయడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ, ఏ దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్నదానిపై చాలామందికి అవగాహన ఉండదు. మూడు, ఐదు, 11, లేదా 108 సార్లు చేయాలా అన్న సందేహాలుంటాయి. అయితే పండితుల వాఖ్యాల ఆధారంగా, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం మరియు ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.

అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి?

Pradakshina

ప్రదక్షిణ అనే పదానికి కుడివైపు తిరగడం(Pradakshina) అని అర్థం వస్తుంది. దైవమూర్తి లేదా ఆలయం చుట్టూ కుడివైపు (సవ్యదిశలో) తిరగడాన్ని ప్రదక్షిణ అంటారు. ఇది కేవలం ఒక శారీరక కదలిక మాత్రమే కాదు, దైవం పట్ల మన భక్తిని, కృతజ్ఞతను తెలియజేసే ఒక ఆధ్యాత్మిక అభ్యాసం. ప్రదక్షిణ చేయడం ద్వారా దైవానుగ్రహాన్ని పొంది, మన దుఃఖాలు తొలగిపోతాయని నమ్మకం.

ప్రదక్షిణను ఒక ధ్యాన యాత్రగా భావించాలి. మనం వేసే ప్రతి అడుగు మనలోని అహంకారం, పాపాలు, కోరికలను వదిలిపెట్టే ప్రయాణంగా భావించాలి. సూర్యుడు తిరిగే దిశలో ప్రదక్షిణలు చేయడం అనేది సానుకూలత, వెలుగును, శుభాన్ని సూచిస్తుంది.

ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలనే విషయంలో పండితులు పలు సూచనలు చేస్తారు. అయితే, సాధారణంగా మూడుసార్లు ప్రదక్షిణలు చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు.

గణపతికి – 1 లేదా 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అలాగే శివాలయంలో – 5 సార్లు, వైష్ణవాలయంలో – 7 సార్లు,అమ్మవారి ఆలయంలో 8 సార్లు ప్రదక్షిణలు చేస్తే మంచిది. హనుమాన్‌కు 11 సార్లు,నవగ్రహాలకు 9 సార్లు, అయ్యయ్యస్వామికి 5 సార్లు , సుబ్రహ్మణ్యస్వామికి మాత్రం 27 సార్లు ప్రదక్షిణలు చేయాలి.

అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 7, 11, 21 లేదా 108 సార్లు కూడా ప్రదక్షిణలు చేయవచ్చు. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, సంఖ్యను లెక్కపెట్టడం కంటే, భక్తితో ఏకాగ్రతతో ప్రదక్షిణలు చేయడం ముఖ్యం.

ప్రదక్షిణ సమయంలో దైవ నామస్మరణ చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. ఇది మనసును శాంతపరచి, ధ్యానంపై ఏకాగ్రతను పెంచుతుంది.
శివాలయాల్లో అయితే ‘ఓం నమః శివాయ’ అని జపించడం మంచిది.హనుమాన్ గుడిలో అయితే ‘శ్రీరామ్ జైరామ్ జై జైరామ్’ అని జపించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

Pradakshina

ప్రదక్షిణ పూర్తయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే మంచిదని పండితులు చెబుతారు. హనుమాన్ గుడిలో ప్రదక్షిణ(Pradakshina) తర్వాత శ్రీరాముని స్తుతించాలి. హనుమాన్ జీ శ్రీరాముని పట్ల ఉన్న భక్తి కారణంగా ఇది ఆయనను అత్యంత సంతోషపరుస్తుంది. హనుమాన్ పాదాల వద్ద 7 రావి ఆకులను సమర్పించడం శుభఫలితాలను ఇస్తుంది.

ప్రదక్షిణ సాధనల వెనుక గొప్ప రహస్యం ఉందని పెద్దలు చెబుతారు. ప్రదక్షిణ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది మనలోని నిస్వార్థత, కృతజ్ఞత, ధైర్యాన్ని పెంచుతుంది. దైవంతో, ప్రకృతితో మనకున్న ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తుంది. ఈ ప్రయాణం మన హృదయాన్ని ప్రశాంతంగా, మనసును కృతజ్ఞతతో నింపుతుంది.

ఈ విధంగా ప్రదక్షిణలు (Pradakshina)చేయడం మనిషి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, మనశ్శాంతికి, కష్టాల నుంచి విముక్తికి సహాయపడుతుంది.

ముఖ్య గమనిక: ప్రతి ఆలయంలో, ఆచారాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కాబట్టి, ఈ సూచనలను పాటించే ముందు నిపుణులైన పండితుల సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version