Shani Trayodashi
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని దేవుని అనుగ్రహం పొందడానికి శని త్రయోదశి(Shani Trayodashi )అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ శనివారం రోజు త్రయోదశి తిథి కలిసి రావడం మంచిది. అయితే ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చే ఈ శని త్రయోదశికి(Shani Trayodashi) ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉందంటున్నారు పండితులు.
జాతకంలో శని దోషాలు ఉన్నవారు, ఏలిననాటి శని, అర్థాష్టమ శని ప్రభావంతో ఇబ్బందులు పడేవారు ఈ రోజున కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం ద్వారా ఉపశమనం పొందొచ్చని అంటున్నారు.
దీనికోసం జనవరి 31 వ తేదీ శనివారం ఉదయాన్నే ప్రాతఃకాలంలో నవగ్రహాల ఆలయానికి వెళ్లి శనీశ్వరుడిని దర్శించుకోవడం శుభప్రదం. అక్కడ శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు శనిదేవుని విగ్రహంపై కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయాలి. శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లేదా ఇతరుల దృష్టి దోషం వల్ల ఇబ్బంది పడేవారు ఆవాల నూనెను సమర్పించాలి.
శని దేవుడికి నీలం రంగు పుష్పాలు అంటే ఎంతో ఇష్టం అట. కాబట్టి పూజ తర్వాత నీలి రంగు పూలను ఆయన పాదాల చెంత ఉంచాలి. ఇవే కాకుండా పిడికెడు రాళ్ల ఉప్పు కానీ నల్ల నువ్వులు కానీ జమ్మి ఆకులను కానీ సమర్పించడం వల్ల శని పీడల నుండి సులభంగా విముక్తి లభిస్తుంది.
ఆలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మననం చేసుకోవాలి. దర్శనం అనంతరం కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని, శిరస్సుపై నీళ్లు చల్లుకుని ఆ తర్వాత శివాలయంలోకి వెళ్లి శివుడిని దర్శించుకోవడం వల్ల రెట్టింపు మంచి ఫలితాలు వస్తాయి.
శనివారం రోజు సాయంత్రం 5:15 నుంచి 5:45 గంటల మధ్య ‘శని త్రయోదశి పర్వం’ అనే అత్యంత శక్తివంతమైన సమయం ఉంటుంది. ఈ సమయంలో శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన నీటితో కానీ, ఆవు పాలతో అభిషేకం చేస్తే శని ప్రభావం నుంచి త్వరగా బయటపడొచ్చు.
ఒకవేళ దేవాలయానికి వెళ్లలేని పరిస్థితి ఉంటే కనుక, ఇంట్లోనే పడమర దిక్కున పీట వేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి, 8 వత్తులను కలిపి ఒకే వత్తిగా చేసి దీపం వెలిగించాలి. శని దేవుడు స్తోత్ర ప్రియుడు కాబట్టి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం కానీ వినడం ద్వారా కానీ ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది.
అలాగే నల్ల నువ్వులు, ఇనుప మేకు, దూది , పెసర పప్పును నల్లని వస్త్రంలో మూట కట్టి దానం చేయడం ద్వారా కర్మ దోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
Gautam Gambhir : మెగాటోర్నీకి ముందు అవసరమా ?..బెడిసికొట్టిన గౌతమ్ గంభీర్ ప్రయోగాలు
