Kamakshi Vratam
చాలామందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోవడం ,సంతాన సమస్యలు ఎదురవ్వడం వంటి వాటితో ఇబ్బంది పడతారు. ఇలాంటి ఆటంకాలను తొలగించి, సకల శుభాలను చేకూర్చే అద్భుతమైన వ్రతం ..కామాక్షి వ్రతం(Kamakshi Vratam ) అంటారు పండితులు.అందుకే ఈ వ్రతాన్ని ముఖ్యంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు.
ఈ కామాక్షి వ్రతాన్ని వరుసగా 16 శుక్రవారాల పాటు ఆచరిస్తే ఆశించని ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వ్రతం చేస్తున్న ప్రతి శుక్రవారం ఉదయాన్నే తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకుని, పూజా గదిలో కామాక్షి అమ్మవారి పటాన్ని ఉంచుకోవాలి.
అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలతో ప్రతీవారం పూజించి, నైవేద్యంగా పాయసం లేదా పండ్లను సమర్పించాలి.ఇలా 16 వారాల పాటు నిష్టగా ఉండి, చివరి వారం ఉద్యాపన చేయాలి.
ఈ వ్రత కాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకుని, అమ్మవారి స్తోత్రాలను పఠించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే కాంచీపురంలో కొలువై ఉన్న కామాక్షి అమ్మవారి అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని పురాణాలు కూడా చెబుతున్నాయి.
Ilayaraja:చిరు సినిమాకు ఇళయరాజా సెగ? సుందరి పాట వాడకంపై ఫ్యాన్స్ టెన్షన్
