Hanuman Dhara: హనుమాన్ ధార రహస్యం తెలుసా? ఆ నీటి చుక్కల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి?

Hanuman Dhara: పైకి వెళ్లే కొద్దీ హనుమంతుడి రూపం , ఆయన భక్తి భావం మనకు అర్థమవుతూ ఉంటుంది.

Hanuman Dhara

రామాయణంలో హనుమంతుడి సాహసాలు మనందరికీ తెలుసు. లంకను దహనం చేసిన హనుమంతుడు ఆ తర్వాత, ఆ మంటల వేడి వల్ల ఆంజనేయుడిశరీరం విపరీతంగా వేడెక్కింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడం కోసం హనుమయ్య ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకున్నారని పురాణాలు చెబుతాయి. అదే ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ కొండపై ఉన్న ‘హనుమాన్ ధార’ (Hanuman Dhara). అయితే ఈ క్షేత్రం కేవలం భక్తికి నిలయం మాత్రమే కాదు, సైన్స్‌కు కూడా అందని ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్య ప్రాంతంగా చరిత్రకెక్కింది..

కొండపై ఒక ఎత్తైన ప్రదేశంలోఈ హనుమంతుడి విగ్రహం కొలువై ఉంటుంది. విచిత్రం ఏమిటంటే, ఆ విగ్రహం పైభాగం నుంచి నిరంతరం నీటి ధార ప్రవహిస్తూ హనుమంతుడి ఎడమ భుజంపై పడుతూ ఉంటుంది.

కొండ పైన ఎక్కడా చెరువులు గానీ, నదులు గానీ లేవు. అయినా సరే ఎండకాలంలో కూడా ఆ నీటి ధార ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది ప్రకృతి సిద్ధంగా జరుగుతున్న ప్రక్రియ అని కొందరు అంటే, లంకా దహనం తర్వాత హనుమంతుడి తాపాన్ని తగ్గించడానికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ నీటి ధారను సృష్టించాడని అక్కడి స్థానికులు చెబుతుంటారు.

Hanuman Dhara

ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే వందలాది మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ హనుమంతుడి రూపం , ఆయన భక్తి భావం మనకు అర్థమవుతూ ఉంటుంది. హనుమంతుడి పైనుంచి వస్తున్న ఆ నీటి ధారలో స్నానం చేయడం వల్లే కాదు ఆ నీటిని తలపై చల్లుకోవడం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోగాలు నయమవుతాయని భక్తుల నమ్ముతారు.

అయితే ఇది భూగర్భ జలాల వల్ల ఇది జరుగుతుందా? లేక కొండ లోపల ఏదైనా రహస్యం దాగి ఉందా? అనే విషయాలపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు. అందుకే హనుమాన్ ధార(Hanuman Dhara) ఒక అంతుచిక్కని ఆధ్యాత్మిక మిస్టరీగా, భక్తుల పాలిట కల్పవృక్షంగా నేటికీ విరాజిల్లుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version